వాయిదా పడిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. అలాంటి రిస్క్ తీసుకోలేమంటోన్న టర్కీ ప్రభుత్వం..!

AIBA World Boxing Championship: మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ (AIBA ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్) డిసెంబర్ 4 నుంచి 18 వరకు టర్కీలో జరగాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం టోర్నమెంట్ వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

వాయిదా పడిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. అలాంటి రిస్క్ తీసుకోలేమంటోన్న టర్కీ ప్రభుత్వం..!
Women Boxing World Championships
Follow us
Venkata Chari

|

Updated on: Nov 11, 2021 | 6:40 AM

AIBA World Boxing Championship: ఇస్తాంబుల్‌లో వచ్చే నెలలో జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను క్రీడల గవర్నింగ్ బాడీ AIBA బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్‌ను మార్చి 2022కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కోవిడ్-19 (COVID-19) పరిస్థితి తీవ్రంగా ఉందని, అటువంటి పరిస్థితిలో పోటీలను నిర్వహించలేమని AIBA తెలిపింది. బెల్‌గ్రేడ్‌లో జరుగుతున్న పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను కూడా వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే నివేదికలు వచ్చాయి. కోవిడ్-19 పరిస్థితి దృష్ట్యా చాలా దేశాలు టర్కీకి వెళ్లేందుకు సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఏఐబీఏ ప్రతినిధి టెలిఫోన్ ద్వారా పీటీఐతో మాట్లాడుతూ, ‘కోవిడ్ కేసుల దృష్ట్యా టర్కీకి వెళ్లడంపై చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేసినందున ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. AIBA ప్రెసిడెంట్ ఒమర్ క్రెమ్లెవ్ సమక్షంలో ఈ అంశంపై ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించాం. ఇందులో అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి” అని అతను పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఈ వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మహమ్మారి కారణంగా స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో టోర్నమెంట్‌ను నిర్వహించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా మారిన నిర్ణయం.. AIBA అధ్యక్షుడు ఒమర్ క్రెమ్లెవ్ జాతీయ సమాఖ్యలకు పంపిన లేఖలో, “టర్కీ నేషనల్ ఫెడరేషన్ సమ్మతితో AIBA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను మార్చి 2022కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు” అని అందులో పేర్కొన్నారు. టోర్నమెంట్ డిసెంబర్ 4 నుంచి 18 వరకు నిర్వహించాలని తొలుత భావించారు. అయితే టర్కీలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. సోమవారం టర్కీలో 27,824 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండేళ్లుగా విధ్వంసం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కారణంగా సోమవారం 187 మంది మరణించారు. కేసుల పెరుగుదలకు కారణం వైరస్ డెల్టా రూపం అని తెలుస్తోంది. 70 కేజీల విభాగంలో ఒలింపిక్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్‌కు భారత్ నేరుగా ప్రవేశం కల్పించగా, డిఫెండింగ్ జాతీయ ఛాంపియన్‌లు అన్ని ఇతర విభాగాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.

పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం.. ఈ నెల బెల్‌గ్రేడ్‌లో జరిగిన పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన ఆకాశ్‌కుమార్ కాంస్య పతకం సాధించాడు. ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. కానీ, నలుగురు అంతకు మించి ముందుకు సాగలేకపోయారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు గతంలో పతకాలు సాధించినవారు విజేందర్ సింగ్ (కాంస్యం, 2009), వికాస్ క్రిషన్ (కాంస్యం, 2011), థాపా (కాంస్యం, 2015), గౌరవ్ బిధూరి (కాంస్యం, 2017), అమిత్ పంఘల్ (రజతం, 2019), మనీష్ కౌషిక్ , 2015). కాంస్యం, 2019) ఉన్నాయి.

Also Read: ENG vs NZ Match Result: ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్..

E‍NG vs NZ, T20 World Cup 2021: న్యూజిలాండ్ టార్గెట్ 167.. రాణించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్.. అర్థ సెంచరీతో ఆకట్టుకున్న మొయిన్ అలీ