Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Bags for Bikes: బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

ద్విచక్ర వాహనాలు కూడా రైడర్ భద్రత కోసం త్వరలో ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులోకి రానున్నాయి. మీరు విన్నది నిజమే. ఇందుకోసం ఆటో కంపెనీ పియాజియో, ఆటోమోటివ్ సేఫ్టీ సిస్టమ్ కంపెనీ ఆటోలివ్ చేతులు కలిపాయి.

Air Bags for Bikes: బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి.. ఇది ఎలా పనిచేస్తుందంటే..
Air Bags For Bikes
Follow us
KVD Varma

|

Updated on: Nov 11, 2021 | 9:32 AM

Air Bags for Bikes: ద్విచక్ర వాహనాలు కూడా రైడర్ భద్రత కోసం త్వరలో ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులోకి రానున్నాయి. మీరు విన్నది నిజమే. ఇందుకోసం ఆటో కంపెనీ పియాజియో, ఆటోమోటివ్ సేఫ్టీ సిస్టమ్ కంపెనీ ఆటోలివ్ చేతులు కలిపాయి. రెండు కంపెనీలు ద్విచక్ర వాహనాల కోసం ఇటువంటి ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీపై పని చేస్తున్నాయి. ఈ ఎయిర్ బ్యాగ్ ప్రమాదంలో వెంటనే తెరుచుకుంటుంది. ఇది రైడర్‌ను గాయం నుండి కాపాడుతుంది. ఈ ఎయిర్‌బ్యాగ్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రమాదం జరిగినప్పుడు సెకన్లలో..

టూవీలర్ ఎయిర్‌బ్యాగ్ గురించి వచ్చిన నివేదికల ప్రకారం, టూవీలర్‌లోని ఫ్రేమ్‌పై ఎయిర్‌బ్యాగ్ అమరుస్తారు. ప్రమాదం జరిగితే, ఈ ఎయిర్‌బ్యాగ్ 1 సెకనులో తెరుచుకుంటుంది. అంటే, ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై నుండి పడిపోతే, అప్పుడు బైక్ నడుపుతున్న వారికి భద్రత లభిస్తుంది. ఆటోలివ్ ఈ ఎయిర్‌బ్యాగ్‌ని అధునాతన అనుకరణ సాధనాలతో అభివృద్ధి చేసింది. స్కూటర్లు, బైక్‌లపై కూడా క్రాష్ టెస్ట్ చేశారు. ఈ ఎయిర్‌బ్యాగ్‌ని రైడర్‌కు మరింత సురక్షితంగా చేయాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి.

కారు ఎయిర్‌బ్యాగ్‌లతో ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఆటోలివ్ కంపెనీ CEO, ఈ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ – నాలుగు చక్రాల వాహనాలలో ఎయిర్‌బ్యాగ్‌ల కారణంగా ప్రమాదం సమయంలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు రక్షించడం జరుగుతోంది. ద్విచక్ర వాహనంలో ఇలా ఉండదు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతారు. దీన్ని అరికట్టేందుకు ద్విచక్ర వాహనంలో కూడా ఈ ఫీచర్‌ను అందించే పనిని ప్రారంభించారు. 2030 నాటికి ఈ ఎయిర్‌బ్యాగ్‌తో ఏడాదిలో లక్ష మంది ప్రాణాలను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

జీన్స్‌లో కూడా ఎయిర్‌బ్యాగ్ అందుబాటులో..

ఫ్రెంచ్ ఇంజనీర్ మోసెస్ షహరివర్ ద్విచక్ర వాహనదారుల కోసం జీన్స్‌ను కూడా డిజైన్ చేశారు. వారు అలాంటి సూపర్-స్ట్రాంగ్ జీన్స్‌ను తయారు చేశారు. వీటిలో ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. రైడర్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ జీన్స్ ధరించినట్లయితే, పడిపోయినప్పుడు ఎయిర్ బ్యాగ్‌లు కంప్రెస్డ్ ఎయిర్‌తో నిండి ఉంటాయి. ఇది పతనంపై శరీరానికి అతి తక్కువ మొత్తంలో షాక్‌కి దారి తీస్తుంది. ఈ ఎయిర్‌బ్యాగ్‌లను మళ్లీ ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేశారు. యూరోపియన్ యూనియన్ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ద్వారా ఎయిర్‌బ్యాగ్ జీన్స్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియ కొనసాగుతోంది. అనేక క్రాష్ టెస్ట్‌లు చేస్తున్నారు. ఇది 2022 నాటికి మార్కెట్లోకి వస్తుందని అంచనా.

ఇవి కూడా చదవండి: వాయిదా పడిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. అలాంటి రిస్క్ తీసుకోలేమంటోన్న టర్కీ ప్రభుత్వం..!

Paytm IPO: వాటా విక్రయాల్లో చరిత్ర సృష్టించిన పేటీఎం.. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే ఛాన్స్..!

Venkatesh : సీనియర్ హీరో వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..