COP26: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రముఖ కార్ల కంపెనీలు.. భవిష్యత్‌లో ఆ వాహనాలు బంద్

గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ కాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కోవటానికి, ప్రపంచంలోని 6 పెద్ద కంపెనీలు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాయి. యూకేలోని గ్లాస్గోలో జరుగుతున్న కాప్26(COP26) సమావేశంలో ఈ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

COP26: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రముఖ కార్ల కంపెనీలు.. భవిష్యత్‌లో ఆ వాహనాలు బంద్
Cop 26 Summit
Follow us

|

Updated on: Nov 11, 2021 | 6:54 AM

COP26: గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ కాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కోవటానికి, ప్రపంచంలోని 6 పెద్ద కంపెనీలు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాయి. యూకేలోని గ్లాస్గోలో జరుగుతున్న కాప్26(COP26) సమావేశంలో ఈ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో అర్థవంతమైన చొరవగా పరిగణిస్తున్నారు. పెట్రోల్-డీజిల్ ఆధారిత వాహనాల విక్రయాలను 2040 నాటికి క్రమంగా తొలగించాలని సమ్మిట్‌లో ప్రతిపాదించారు. ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్, జనరల్ మోటార్స్, వోల్వోతో సహా దాదాపు ఆరు ప్రధాన కార్ల తయారీ సంస్థలు దీనికి అంగీకరించాయి. అయితే, టయోటా, వోక్స్‌వ్యాగన్, నిస్సాన్-రెనాల్ట్ వంటి అనేక పెద్ద కార్ల తయారీదారులు దీనిని అంగీకరించడానికి నిరాకరించారు.

గ్లాస్గోలో శుక్రవారంతో ముగియనున్న శిఖరాగ్ర సదస్సు

పర్యావరణాన్ని కాపాడేందుకు గత 2 వారాలుగా గ్లాస్గోలో జరుగుతున్న కాప్26(COP26) సదస్సు శుక్రవారంతో ముగియనుంది. అంతకుముందు బుధవారం ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పులను పర్యవేక్షించే ఏజెన్సీ ముసాయిదాను విడుదల చేసింది. ఇందులో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యాన్ని పునరాలోచించాలని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేశారు. జారీ చేసిన పత్రాలు ఒప్పందం ప్రారంభ రూపురేఖలుగా చెబుతున్నారు. ఈ గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ తర్వాత, దాదాపు 200 దేశాలు దీనిపై అంగీకరించాలి. శుక్రవారంతో శిఖరాగ్ర సమావేశం ముగుస్తుంది.

కఠినమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి..

గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు దేశాలు కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఏజెన్సీ పేర్కొంది. బొగ్గు, చమురు, గ్యాస్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడానికి ప్రజలను ప్రోత్సహించాలి. వారికి ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేయాలి. 1.5 °C (2.7 ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతను తగ్గించాలని నిర్ణయించిన పాత లక్ష్యం గురించి కూడా శిఖరాగ్ర సమావేశం మాట్లాడింది. శాస్త్రవేత్తల ప్రకారం, వేడి తరంగాల పెరుగుదల కారణంగా, అడవి మంటలు, వరదలు, కరువు వంటి సంఘటనలు పెరుగుతాయి. భూమి ఉష్ణోగ్రత ఇప్పటికే 1.1 °C పెరిగింది.

ప్రధాని మోడీ అద్భుత సందేశం..

ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం అదేవిధంగా ఒకే గ్రిడ్ అనే విజన్‌ను మనం గ్రహించగలిగితే.. అది సౌర ప్రాజెక్టులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని మోడీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 (COP26) లీడర్స్ ఈవెంట్‌లో రెండవ రోజు గ్రీన్ ఎనర్జీపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ‘యాక్సిలరేటింగ్ క్లీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్’ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ ఆయన సౌరశక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఎంత కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయో, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లగలమో ఒక్కసారి ఊహించుకోండి అని మోడీ అన్నారు. దీంతో దేశాల మధ్య సహకారం పెరుగుతుంది. కొన్ని దేశాలు శిలాజ ఇంధనాల నుండి ప్రయోజనం పొందడానికి ప్రయత్నించవచ్చును. కానీ, ఇది ప్రపంచానికి చాలా హాని కలిగిస్తుంది. దీంతో భౌగోళికంగా కూడా సమస్యలు పెరుగుతాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి: వాయిదా పడిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. అలాంటి రిస్క్ తీసుకోలేమంటోన్న టర్కీ ప్రభుత్వం..!

Paytm IPO: వాటా విక్రయాల్లో చరిత్ర సృష్టించిన పేటీఎం.. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే ఛాన్స్..!

Venkatesh : సీనియర్ హీరో వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..