Coronavirus: జర్మనీలో మళ్లీ బుసలు కొడుతోన్న కరోనా.. బుధవారం ఒక్కరోజే 39 వేలకు పైగా కేసులు..
శాంతించిందనుకున్న కరోనా మమళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది
శాంతించిందనుకున్న కరోనా మమళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాతో పాటు బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్‌లలో రోజువారీ కొవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్‌ను నిరోధించేందుకు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. ఇక జర్మనీలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 39, 676 కొత్త కేసులు నమోదయ్యాయి. గత శుక్రవారం 37, 120 మంది వైరస్ బారిన పడగా బుధవారం ఆ సంఖ్యను మించి పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా అక్కడ ఇన్ఫెక్షన్ రేటు ప్రతి లక్ష మందికి 232.1 కి చేరిందని, ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ల లాక్‌డౌన్ తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
బాధితుల్లో టీకా తీసుకోని వారే ఎక్కువ.. జర్మనీ దేశంలోని ఆస్పత్రులు కరోనా బాధితులతో నిండిపోయాయి. ముఖ్యంగా ఐసీయూలో చేరే వారి సంఖ్య అధికంగా ఉంది. దీంతో కొత్త రోగులను చేర్చుకోలేమని ఆస్పత్రి యాజమాన్యాలు బోర్డుపెట్టేశాయి. కొవిడ్ రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఇతర రోగులకు సర్జరీలు పూర్తిగా నిలిపివేశామని వైద్యులు చెబుతున్నారు. కరోనాతో ఆస్పత్రుల్లో చేరేవారిలో టీకా తీసుకోనివారే అధికంగా ఉన్నారని, ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మొత్తం 8.30 కోట్ల జనాభా ఉన్న జర్మనీలో ఇప్పటివరకు 67 శాతం మంది పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్నారు. కాగా కొవిడ్‌తో ఇప్పటివరకు 96,963 మంది మృత్యువాత పడ్డారు.
Also Read: