AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Person: చిన్నారుల్లో చిరునవ్వు కోసం ఉచితంగా 37 వేల ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు చేసిన డాక్టర్..

Inspiring Person: కొందరు తాము ఎదగడానికి పడిన కష్టాలు గుర్తు పెట్టుకుని.. తమకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తమకు తోచినంతలో నలుగురికి సాయం చేస్తారు. ఒకరికి ఇవ్వడంలో..

Inspiring Person: చిన్నారుల్లో చిరునవ్వు కోసం ఉచితంగా 37 వేల ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు చేసిన డాక్టర్..
Plastic Surgeon
Surya Kala
|

Updated on: Nov 10, 2021 | 8:41 PM

Share

Inspiring Person: కొందరు తాము ఎదగడానికి పడిన కష్టాలు గుర్తు పెట్టుకుని.. తమకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తమకు తోచినంతలో నలుగురికి సాయం చేస్తారు. ఒకరికి ఇవ్వడంలో ఉన్న తృప్తిని అనుభవిస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులను సమాజం ఎప్పుడు ఉన్నతస్థానం ఇస్తుంది. గౌరవిస్తుంది. తన ఉన్నతికి కారణమైన సమాజానికి ఎంతోకొంత ఇవ్వాలనే నేచర్ ఉన్న వ్యక్తి డాక్టర్ సుబోధ్ సింగ్.

వారణాసికి చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు. దీంతో బాల్యంలో చాలా కష్టపడ్డారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సబ్బులు, గాగుల్స్ వంటిని అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచేవారు. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు డబ్బుల కోసం అనేక పార్ట్ టైం జాబ్స్ చేశారు. వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్ సుబోధ్ సింగ్ ఈ రోజు చీలిక పెదవి/అంగిలికి శస్త్రచికిత్సలు చేయడం ద్వారా ప్లాస్టిక్ సర్జన్‌గా పేరు తెచ్చుకున్నాడు.  ఇప్పటికి పుట్టిన పిల్లలకు 37,000 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసి 25,000 కుటుంబాల్లో చిరునవ్వులు నింపారు. పేదలకు డాక్టర్ సింగ్ చేసిన సేవ అతనికి విస్తృత గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2009లో అకాడమీ అవార్డ్ ను అందుకున్నారు. 2013 లో వింబుల్డన్ మెన్ సింగిల్స్ ఫైనల్ కోసం సెంట్రల్ కోర్ట్‌లో హాజరైన ముఖ్య ఆతిధుల్లో ఒకరు సుబోధ్ సింగ్.

రైల్వే క్లర్క్ పనిచేసే సుబోధ్ తండ్రి 1979లో మరణించారు. వారణాసిలోని చిన్న రైల్వే క్వార్టర్స్‌లో నివసించిన కుటుంబం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో సోదరుడితో కలిసి సుబోధ్ ఇంట్లో తయారుచేసిన సబ్బులను విక్రయించేవారు. అతని పెద్ద సోదరుడు కారుణ్య ప్రాతిపదికన రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు, కాని కుటుంబ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదు. 1982లో, అతని సోదరుడు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అతని మొదటి బోనస్ రూ. 579 అందుకున్నప్పుడు, అతను వైద్య ప్రవేశ సన్నాహాల కోసం యువకుడు సుబోధ్ ఫీజు చెల్లించడానికి దానిని ఉపయోగించాడు. కదిలిన, సుబోధ్ తన సోదరుల త్యాగాలను వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో యుధ దళాల వైద్య కళాశాల(AFMC-పుణె), BHU-PMT, UP స్టేట్ కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్(CPMT) మూడు మెడికల్ ప్రవేశ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించారు.  వైద్య విద్య పూర్తిచేసిన తర్వాత సుబోధ్ ఫ్యామిలీ ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. గత ఏడాది తల్లి మరణించింది.

అయితే పేదలకు సాయం చేయమన్న తల్లిదండ్రుల మాట ప్రకారం పేదలకు ఉచితంగా వైద్య సాయం అందిస్తున్నారు. 2002  నుంచి ప్రతి సంవత్సరం తండ్రి వర్ధంతి రోజున పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 2003-04 నుంచి క్లెఫ్ట్ పాలెట్ శస్త్రచికిత్సలు చేస్తూ ‘ది స్మైల్ ట్రైన్’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యింది. ఈ బృందం సహకారంతో 2005 చివరి నాటికి 500 ఉచిత శస్త్రచికిత్సలు చేసిన సుబోధ్.. మరుసటి ఏడాదికి 2,500 పూర్తిచేశాడు.  అప్పటి నుంచి సుబోధ్ సింగ్ 2008-09 నుంచి ఏటా 4,000కు పైగా ఉచిత శస్త్రచికిత్సలు చేస్తూనే ఉన్నారు.

ప్లాస్టిక్ సర్జన్లు, సామాజిక కార్యకర్తలు, పోషకాహార నిపుణులు, స్పీచ్ థెరపిస్టుల బృందంతో దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారతంలో క్లెఫ్ట్ పాలెట్‌తో బాధపడుతున్న పిల్లలను ట్రాక్ చేసేందుకు ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను సుబోధ్ సిద్ధం చేశారు. సుబోధ్ అండ్ టీమ్ 6,000 బర్న్ సర్జరీలను కూడా ఉచితంగా నిర్వహించి తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న వారి జీవితాల్లో సంతోషాన్ని నింపారు.

అరుదైన గౌరవం సెంటర్ కోర్ట్ ఆఫ్ వింబుల్డన్‌లో ఆండీ ముర్రే , నోవాక్ జొకోవిచ్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టాస్ వేసే సమయంలో డాక్టర్ సింగ్ సమక్షంలో, అతని రోగి పింకీ సోంకర్‌కు నాణెం వేసే అరుదైన గౌరవం లభించింది.

Also Read:  మృతుడి కుటుంబానికి న్యాయం చేయమంటే కేసులుపెడతారా? జనసేన బాధితులకు అండగా ఉంటున్న పవన్ కళ్యాణ్