- Telugu News Photo Gallery Technology photos Vivo Launches New smrat phone Vivo Y76s Have a look on features and price details
Vivo Y76s: మార్కెట్లోకి వివో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Vivo Y76s: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై 76 ఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Nov 11, 2021 | 2:53 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మార్కెట్లోకి వివో వై 76 ఎస్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌ను అందించారు. 6.58 ఇంచెస్ ఫుల్ HD+ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం.

కెమెరాకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఫోన్ ధర విషయానికొస్తే.. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ఇండియాలో రూ. 20,800, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 23,200గా ఉండొచ్చని అంచనా.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌ను 20:9 యాస్పెక్ట్ రేషియో, 90.61 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో అందించారు.44W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ మరో ప్రత్యేకత.





























