Indian-origin American: భారత్‌కు చెందిన ఐటీ నిపుణుడికి జీవిత ఖైదు.. శిక్ష ఖరారు చేసిన అమెరికా కోర్టు
భారత్‌కు చెందిన ఐటీ నిపుణుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. కుటుంబ సభ్యులను తానే చంపేసినట్టు ఒప్పుకోవడంతో కోర్టు పెరోల్ లేకుండా శిక్ష విధిస్తూ ఈ తీర్పును వెలువరించింది.
Indian-origin sentenced in US: భారత్‌కు చెందిన ఐటీ నిపుణుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. కుటుంబ సభ్యులను తానే చంపేసినట్టు ఒప్పుకోవడంతో కోర్టు పెరోల్ లేకుండా శిక్ష విధిస్తూ ఈ తీర్పును వెలువరించింది. కాలిఫోర్నియాలోని తన అపార్ట్‌మెంట్‌లో హంగూద్ (55) తన భార్య, ముగ్గురు పిల్లలను చంపినట్లు ఒప్పుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అతను ఆర్థికంగా నష్టపోయి కుటుంబాన్ని పోషించలేక హతమార్చినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శంకర్ నాగప్ప శిక్షకు సంబంధించి కెసిఆర్‌ఎ-టివి బుధవారం నివేదించింది. ప్లేసర్ కౌంటీలో శిక్ష విధించే సమయంలో మాట్లాడేందుకు అతను నిరాకరించాడని నివేదిక పేర్కొంది.
భారతదేశానికి చెందిన శంకర్ నాగప్ప (55) ఐటీ నిపుణిడిగా ఓ కంపెనీలో జాబ్ చేస్తూ తన కుటంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలో నివాసం ఉండేవాడు. అయితే, 2019లో అతడి జాబ్ పోయింది. దీంతో ఒక్కసారిగా షాకైన శంకర్.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కుటంబ సభ్యులను పోషించలేనని భావించిన అతడు.. వారిని హతమార్చేందుకు సిద్ధం అయ్యాడు. పక్కా ప్లాన్‌తో వారం వ్యవధిలో భార్య, ముగ్గురు పిల్లను హత్య చేశాడు. రోజ్‌విల్లేకు ఉత్తరాన 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ శాస్తా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి నలుగురిని చంపినట్లు లొంగిపోయాడు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.
అయితే విచారణ సందర్భంగా తాను ఈ దారుణానికి పాల్పడలేదని శంకర్ వాదించాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ముగ్గురు పిల్లలు హతమార్చిన అనంతరం తన భార్య ఆత్మహత్య చేసుకుందని మాటమార్చిన కోర్టుకు తప్పుడు సమాచారం అందించాడు. కాగా, కొద్ది రోజుల క్రితం వరకూ అదే వాదనను కొనసాగించిన ఆయన.. తాజాగా తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అమెరికా న్యాయస్థానం.. శంకర్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా అతడికి పెరోల్‌పై బయటకు వచ్చే అవకాశం కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది.
ఇదిలావుంటే, రోజ్‌విల్లే పోలీసులు అతని భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను జంక్షన్ రోడ్‌లోని కుటుంబ అపార్ట్‌మెంట్‌లో కనుగొన్నారు. నాల్గవ మృతదేహం, అతని కుమారుడిది, మౌంట్ శాస్తాలోని పోలీస్ స్టేషన్ వెలుపల పార్క్ చేసిన అతని కారులో గుర్తించారు పోలీసులు. వారం రోజుల అనంతరం తన కుటుంబాన్ని చంపానని నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణాలు మూడు రోజుల వ్యవధిలో అతని భార్య, పిల్లలను హతమార్చాడని పోలీసులు కోర్టులో పూర్తి ఆధారాలతో నిరూపించారు.
జంక్షన్ బౌలేవార్డ్‌లోని వుడ్‌క్రీక్ వెస్ట్ కాంప్లెక్స్‌లోని రోజ్‌విల్లే అపార్ట్‌మెంట్‌లో అక్టోబర్ 7న శంకర్ నాగప్ప తన భార్య, అతని కుమార్తె, అతని చిన్న కొడుకును హత్య చేశాడు. తర్వాత అతను తన పెద్ద కొడుకును రోజ్‌విల్లే, మౌంట్ శాస్తా మధ్య ఎక్కడో చంపాడు. అక్కడ అతను తన కొడుకు మృతదేహంతో అక్టోబర్ 13న పోలీసులకు లొంగిపోయాడు. మృతులు జ్యోతి శంకర్ (46)గా గుర్తించారు. వరుమ్ శంకర్(20), గౌరీ హంగుడ్(16),నిశ్చల్ హంగుద్(13)గా పోలీసులు నిర్ధారించారు. కాగా, ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులను చంపే ప్రత్యేక పరిస్థితుల కారణంగా రోజ్‌విల్లే తండ్రికి పెరోల్ అవకాశం లేకుండా జైలు శిక్ష విధించినట్లు జిల్లా అటార్నీ కార్యాలయం తెలిపింది.