Crime News: హైదరాబాద్‌లో దారుణం.. రూ.2 వేలు కోసం స్నేహితుడి హత్య.. గొంతు కోసి..

Hyderabd Crime News: క్షణికావేశంలో కొంతమంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందువెనుక ఆలోచించకుండా సాటివారిపైనే దాడులకు పాల్పడి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. రూ.2 వేలు కోసం స్నేహితుడి హత్య.. గొంతు కోసి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 12, 2021 | 7:21 AM

Hyderabd Crime News: క్షణికావేశంలో కొంతమంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందువెనుక ఆలోచించకుండా సాటివారిపైనే దాడులకు పాల్పడి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో రూ.2వేల కోసం.. ఓ వ్యక్తి స్నేహితుడనే కనికరం లేకుండా దారుణంగా గొంతుకోసి హత్యచేశాడు. ఈ ఘోర సంఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రూ.2 వేల కోసం స్నేహితుడిని చంపిన ఘటన ముషీరాబాద్‌లోని ఫకిర్‌వాడలో గురువారం రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన సోను (27) బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం నగరానికి వచ్చి ముషీరాబాద్‌లో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. ముషీరాబాద్‌ మటన్‌ షాపులో పనిచేసే అల్తాఫ్‌ఖాన్‌ – సోను ఇద్దరు స్నేహితులు. ఈ క్రమంలో అల్తాఫ్‌ఖాన్‌ మూడు నెలల క్రితం సోనుకు రూ.2 వేలు అప్పు ఇచ్చాడు. ఎప్పటిలాగే.. ఇద్దరూ కలిసి గురువారం రాత్రి మద్యం తాగారు. అప్పు విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఈ వాదన కాస్త గొడవకు దారితీసింది.

అనంతరం అల్తాఫ్‌ఖాన్‌ అక్కడినుంచి మటన్‌ దుకాణానికి వెళ్లి కత్తి తీసుకొచ్చి సోనుపై దాడి చేశాడు. గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత అల్తాఫ్ ఖాన్ ముషీరాబాద్‌ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిపారు. సమచారం అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

ఉద్యోగినిపై సెక్రటరీ స్థాయి అధికారి లైంగిక వేధింపులు.. సంచలనంగా మారిన వీడియో.. నిందితుడి అరెస్ట్..

సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..