AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala: మహిళల వాష్‌రూంలో సీక్రెట్‌ కెమెరా.. కేరళ దూరదర్శన్‌ కేంద్రంలో బయటపడ్డ ఉదంతం..

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో ట్రయల్‌ రూంలో మహిళ దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు ఫొటోలు తీసిన సంఘటన సంచలనం..

Kerala: మహిళల వాష్‌రూంలో సీక్రెట్‌ కెమెరా.. కేరళ దూరదర్శన్‌ కేంద్రంలో బయటపడ్డ ఉదంతం..
Basha Shek
|

Updated on: Nov 11, 2021 | 6:14 PM

Share

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో ట్రయల్‌ రూంలో మహిళ దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు ఫొటోలు తీసిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నగరంలోని ఓ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్‌లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారనే విషయం కలకలం రేపింది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. అక్కడి దూరదర్శన్‌ కేంద్రంలోని మహిళల వాష్‌రూంలో రహస్యంగా అమర్చిన సీక్రెట్‌ కెమెరాను ఓ మహిళ గుర్తించింది. దూరదర్శన్‌ కేంద్రంలోని ప్రధాన స్టూడియోకు సమీపంలోని బాత్రూంలో ఈ సీక్రెట్‌ కెమెరాను అమర్చారు. ఈ విషయం తెలుసుకున్న దూరదర్శన్‌ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

అంతర్గత విచారణలో.. ఈ క్రమంలో తిరువనంతపురం సైబర్‌ సెల్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. దూరదర్శన్‌ కేంద్రంలోని మహిళా కమిటీ, క్రమశిక్షణా సలహా కమిటీ అధికారులు ఈ విషయంపై అంతర్గతంగా విచారణ జరపగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. దూరదర్శన్‌ కార్యాలయంలో ఇటీవల తాత్కాలిక పద్ధతిలో నియమితుడైన ఓ ఉద్యోగి ఈ రహస్య కెమెరాను అమర్చినట్లు విచారణలో తెలిసింది. బాత్రూంలోని కెమెరాను వెంటనే తీసేయడంతో సదరు ఉద్యోగిని విధుల్లోంచి తొలగించినట్లు విచారణాధికారులు వెల్లడించారు.

Also Read:

ఉద్యోగినిపై సెక్రటరీ స్థాయి అధికారి లైంగిక వేధింపులు.. సంచలనంగా మారిన వీడియో.. నిందితుడి అరెస్ట్..

Hyderabad: పైకి అందమైన ఫోటో ప్రేమ్స్.. లోపల చీకటి బాగోతం.. పోలీసులు స్టన్

Road Accident: ఛత్‌పూజ చేసుకొని ఇంటికి వెళుతుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..