Road Accident: ఛత్‌పూజ చేసుకొని ఇంటికి వెళుతుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
Chhath Puja Devotees Killed: ఆ మహిళలంతా ఛత్‌పూజను జరుపుకొని ఇళ్లకు బయలు దేరారు. మరికాసేపట్లో ఇంటికి చేరుతారనగా.. మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. వారు ప్రయాణిస్తున్న
Chhath Puja Devotees Killed: ఆ మహిళలంతా ఛత్‌పూజను జరుపుకొని ఇళ్లకు బయలు దేరారు. మరికాసేపట్లో ఇంటికి చేరుతారనగా.. మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢికొట్టడంతో తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో సంభవించింది. అసోం-త్రిపుర సరిహద్దునున్న పాథరకండి పోలీసుస్టేషను పరిధిలోని బైతఖల్ వద్ద ఆటోను ఓ సిమెంట్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది దుర్మరణం చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఛత్‌పూజ ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో మహిళలు, యువతులు, చిన్నపిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఆటోను ఢీకొన్న తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను దుజా బాయి పనికా, సాలు బాయి పనికా, గరువ్ దాస్ పనికా, శంభు దాస్ పనికా, లాలోన్ గుస్వామి, పూజ గోర్, దేబ్ గోర్, సాను రీ, మంగ్లే కర్మాకర్‌గా గుర్తించారు.
కాగా.. ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంతాపాన్ని తెలియజేసారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు.
Also Read: