సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌పై ఫిర్యాదుల వెల్లువ.. పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్న బాధితులు..
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై వెల్లువలా ఫిర్యాదులు వస్తున్నాయి. రాయదుర్గం, నార్సింగి, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో బాధితులు క్యూ కడుతున్నారు. నార్సింగి పీఎస్‌లో..

MD Sridhar Rao: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై వెల్లువలా ఫిర్యాదులు వస్తున్నాయి. రాయదుర్గం, నార్సింగి, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో బాధితులు క్యూ కడుతున్నారు. నార్సింగి పీఎస్‌లో అజమ్ షరీఫ్ ఫిర్యాదు చేశారు. Nri యలమంచలి కేశవరావుకు చెందిన 11 ఎకరాల భూమిపై శ్రీధర్ రావ్ కన్ను పడింది. జేసీబీలతో ట్రేస్ పాస్‌కు యత్నించారు శ్రీధర్ రావ్. దీంతో నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో మరికాసేపట్లో కేసులు నమోదు చేయబోతున్నారు పోలీసులు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావును రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. నానక్ రామ్ గూడలోని 5 ఎకరాల స్థలం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 300 కోట్ల రూపాయలకు 5ఎకరాల భూమి కొనుగోలు చేశారు శ్రీధర్ రావు.
అయితే.. ఏజెంట్‌గా ఉండి స్థలం ఇప్పించిన వారికి కమీషన్ ఎగ్గొట్టారనే ఆరోపణలు వ్చచాయి. కమీషన్ రూపంలో కమర్షియల్ బిల్డింగ్‌లో స్థలం ఇస్తానని శ్రీధర్ రావు హామీ ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. కొనుగోలు మొత్తం పూర్తయ్యాక తమను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల ఎంట్రీతో శ్రీధర్‌రావుకు సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తమను కూడా మోసం చేశాడంటూ మరో 10 మంది పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి: Makeup Tips: కూతురి పెళ్లిలో తల్లి ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలను పాటిస్తే చాలు గ్రేస్‌ఫుల్ లుక్..
SBI: ఎస్‌బీఐలో ఈ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 2 లక్షల ప్రమాద బీమా ఫ్రీ..
Chanakya Niti: కష్టాల్లో ఉన్నారా.. ఇలా ధృఢంగా ఉండండి.. అదే మీ విజయానికి పూలబాట..
Alcohol: మద్యం తాగుతున్నారా.. ఇది మీకు బ్యాడ్ న్యూసే.. మీ బాడీలో ‘నిషా’ ఎప్పటివరకు ఉంటుందంటే..