Wig Cheating: విగ్గుతో బురిడీ కొట్టించాడు.. అమ్మాయిలను బుట్టలో వేశాడు.. తీరా కట్ చేస్తే..
బట్టతల కప్పి పుచ్చి.. అమ్మాయిలకు కుచ్చుటోపీ పెడుతున్న మాయగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షేక్ మహ్మద్ రఫీ అనే వ్యక్తి.. తనను తాను ఎన్నారైగా కలరింగ్ ఇచ్చుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో..

బట్టతల కప్పి పుచ్చి.. అమ్మాయిలకు కుచ్చుటోపీ పెడుతున్న మాయగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షేక్ మహ్మద్ రఫీ అనే వ్యక్తి.. తనను తాను ఎన్నారైగా కలరింగ్ ఇచ్చుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళలను పరిచయం చేసుకుని వారిని మాయమాటలతో మోసం చేస్తున్నాడు. సహజీవనం చేయడం ఆ తర్వాత హ్యాండివ్వడం హాబీగా మలచుకున్నాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో విగ్గు మాస్టర్ విశ్వరూపం మొత్తం బయటికొచ్చింది. రఫీ ప్రాపర్ తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం. చదువు అబ్బక పాలిటెక్నిక్ మధ్యలోనే వదిలేశాడు. 2010లో వేర్వేరు చోట్ల కార్మికుడిగా పనిచేశాడు.
రఫీకి భార్య ఇద్దరు పిల్లలు. వేధింపులు భరించలేక వాళ్లంతా రఫీకి దూరంగా ఉంటున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ రఫీ.. ఈజీమనీ కోసం రాంగ్‌రూట్ పట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నారై అని బిల్డప్ ఇస్తూ మహిళలకు దగ్గరయ్యేవాడు. అలా KPHB కాలనీకి చెందిన బాధితురాలితో పాటు మరో నలుగురిని ఒకే రకంగా మోసం చేశాడు.
బట్టతలతో కనిపించే రఫీ విగ్గుతో కలరింగ్ ఇచ్చేవాడు. అసలు పేరు కాకుండా కార్తీక్ వర్మ పేరుతో పరిచయాలు పెంచుకునేవాడు. కొంతకాలం వారితో సహజీవనం చేసి ఆ తర్వాత నగదు, నగలతో ఉడాయించేవాడు. బాధితురాలి ఫిర్యాదుతో రఫీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు ఎస్సార్ నగర్ పోలీసులు.
ఇవి కూడా చదవండి: Makeup Tips: కూతురి పెళ్లిలో తల్లి ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలను పాటిస్తే చాలు గ్రేస్‌ఫుల్ లుక్..
SBI: ఎస్‌బీఐలో ఈ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 2 లక్షల ప్రమాద బీమా ఫ్రీ..
Chanakya Niti: కష్టాల్లో ఉన్నారా.. ఇలా ధృఢంగా ఉండండి.. అదే మీ విజయానికి పూలబాట..
Alcohol: మద్యం తాగుతున్నారా.. ఇది మీకు బ్యాడ్ న్యూసే.. మీ బాడీలో ‘నిషా’ ఎప్పటివరకు ఉంటుందంటే..