Love Story: వీడు మామూలోడు కాదు.. లవర్‌కి డబ్బులిచ్చేందుకు కిడ్నాప్ డ్రామా.. షాకింగ్ న్యూస్..

Teen plans own abduction story: లవర్ ఖర్చుల కోసం.. ఓ యువకుడు ప్లాన్ వేశాడు. కిడ్నాప్ డ్రామాలాడి.. తల్లిదండ్రులకు రెండున్నర లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి

Love Story: వీడు మామూలోడు కాదు.. లవర్‌కి డబ్బులిచ్చేందుకు కిడ్నాప్ డ్రామా.. షాకింగ్ న్యూస్..
Love Story
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 11, 2021 | 11:37 AM

Teen plans own abduction story: లవర్ ఖర్చుల కోసం.. ఓ యువకుడు ప్లాన్ వేశాడు. కిడ్నాప్ డ్రామాలాడి.. తల్లిదండ్రులకు రెండున్నర లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ సంఘటన భింద్ జిల్లాలోని గోహద్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన లవర్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా అల్లుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. వాయిస్ మార్చే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. కొడుకును కిడ్నాప్ చేశామంటూ తన తండ్రికి రూ.2.5 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోహద్‌కు చెందిన సురేంద్ర కుష్వాహా కుమారుడు సందీప్ కుష్వా (18) నవంబర్ 6వ తేదీన కనిపించకుండా పోయాడు. కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో.. సురేంద్ర కుష్వాహా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు కుమారుడి మొబైల్ నుంచి 8న ఫోన్ రావడంతో సురేంద్ర మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఫోన్ వచ్చిన లొకేషన్ ఆధారంగా గ్వాలియర్‌లోని ఓ ప్రాంతంలో దాడులు నిర్వహించి సందీప్‌ను పోలీసులు సురక్షితంగా పట్టుకున్నారు.

సందీప్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీసులు విచారించగా.. అతను చెప్పె విషయాలు విని షాకయ్యారు. తన లవర్‌ని కలవడానికి గురుగ్రామ్ వెళ్లాలనుకున్నానని.. అందుకు డబ్బులు కావాల్సి ఉందని తెలిపారు. అందుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు యువకుడు వెల్లడించాడు. కాగా.. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గోహద్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గోపాల్ సింగ్ సికర్వార్ తెలిపారు. ముందు డబ్బులు అడిగితే.. కుటుంబసభ్యులు ఇవ్వలేదని దీంతో ఈ ప్లాన్ రచించినట్లు తెలిపారు.

కాగా.. బెదిరింపు కాల్ చేసే ముందు.. వాయిస్ అప్లికేషన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ముందు తన స్నేహితురాలికి ఫోన్ చేసినట్లు పోలీసులకు చెప్పడంతో వారు షాకయ్యారు.

Also Read:

ప్రియుడిని కలిసేందుకు ఇంటికెళ్లిన బాలికపై కన్ను.. ఆ తర్వాత లవర్ తండ్రి ఏం చేశాడంటే..?

India Corona: మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా నిన్న ఎంతమంది చనిపోయారంటే..?

ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..