Hyderabad: పైకి అందమైన ఫోటో ప్రేమ్స్.. లోపల చీకటి బాగోతం.. పోలీసులు స్టన్
హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఫొటో ఫ్రేమ్స్‌తో డ్రగ్స్ దందాకు పాల్పడుతోన్న ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు
హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఫొటో ఫ్రేమ్స్‌తో డ్రగ్స్ దందాకు పాల్పడుతోన్న ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల దగ్గర్నుంచి 22 ఫొటో ప్రేమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఫొటో ఫ్రేమ్‌లో 30 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్‌ను అమర్చి సప్లై చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితులు ఎలా డ్రగ్స్ దందాకి పాల్పడుతున్నారో డెమో చూపించి ఎక్స్‌ప్లైన్ చేశారు.
ప్రధాన నిందితుడు ధరావత్ సాయిచరణ్ డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్‌ను కొనుగోలు చేసి వాటిని ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి సప్లై చేస్తున్నట్లు హైదరాబాద్ వెస్ట్ జోన్ జాయింట్ సీపీ తెలిపారు. తన అనుచరులు అంకిత్, అజయ్‌సాయి ద్వారా ఈ డ్రగ్స్‌ను స్టూడెంట్స్‌కి సప్లై చేస్తున్నట్లు గుర్తించినట్టు వెల్లడించారు. బేగంపేటలోకి ఓ ఇంటర్నేషనల్ పార్సెల్ ఆఫీస్ నుంచి ఈ ఫొటో ఫ్రేమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను ఎపిడ్రిన్‌గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ డ్రగ్స్ పంపుతున్నట్లు సమాచారం. మొత్తం 14 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయ్. వీటి విలువ ఐదున్నర కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.
Also Read: Viral Video: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు…