Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగినిపై సెక్రటరీ స్థాయి అధికారి లైంగిక వేధింపులు.. సంచలనంగా మారిన వీడియో.. నిందితుడి అరెస్ట్..

ఉత్తరప్రదేశ్‎లో సెక్రటరీ స్థాయి అధికారి బరితెగించాడు. సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులను బాధితురాలు మొబైల్‎లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది...

ఉద్యోగినిపై సెక్రటరీ స్థాయి అధికారి లైంగిక వేధింపులు.. సంచలనంగా మారిన వీడియో.. నిందితుడి అరెస్ట్..
Yadav
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 11, 2021 | 5:40 PM

ఉత్తరప్రదేశ్‎లో సెక్రటరీ స్థాయి అధికారి బరితెగించాడు. సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులను బాధితురాలు మొబైల్‎లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై స్పందించిన యూపీ సర్కార్ నిందితుడిని అరెస్ట్ చేయించింది. ఈ విషయాన్ని సీఎంవో మీడియా సలహాదారు షహలబ్ మణి త్రిపాఠి తెలిపారు. నవంబర్ 10న లక్నో సెక్రటేరియట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న సెక్రటరీ స్థాయి ఇచ్ఛారామ్ యాదవ్‌ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. వీడియోలో యాదవ్ మహిళా ఉద్యోగినిని బలవంతం చేయడం కనిపించింది.

మొదట ఆ మహిళ యాదవ్‌ను దూరంగా నెట్టడానికి తన శాయశక్తులా ప్రయత్నించింది. కానీ యాదవ్ ఆమెపై మరింత రెచ్చిపోయాడు. దీంతో బాధితురాలు హుసైన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 29న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 354, 506, 294 కింద ఫిర్యాదు ఆధారంగా యాదవ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2018 నుంచి యాదవ్ తనను వేధిస్తున్నాడని.. 2013 నుంచి సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

దాదాపు ఒక నెల క్రితం యాదవ్ తనతో వాష్‌రూమ్‌లో చేరి ‘సరదాగా ఉండమని కోరాడని బాధితురాలు తెలిపింది. ఆమె అభ్యంతరం చెప్పడంతో ఉద్యోగం నుండి తొలగిస్తానని యాదవ్ బెదిరించాడని వాపోయింది. తన కోరిక తీర్చకుంటే జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే చంపేస్తానని భయభ్రంతులకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులలో తెలిపింది.

మహిళ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు హుసైన్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ సింగ్ చెప్పారు. సెక్షన్ 164 కింద తన స్టేట్‌మెంట్‌ను సమర్పించడానికి బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు హాజరుకాలేదని పోలీసులు తెలిపారు. యాదవ్‌ను అరెస్టు చేశామని, త్వరలో కోర్టులో హాజరుపరుస్తామని సింగ్ చెప్పారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని వివరించారు.

Read Also.. Viral Video: బాధితుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీసు.. శభాష్ రాజేశ్వరి అంటూ ప్రశంసలు.. వైరల్‎ అయిన వీడియో..