అనంతపురంలో కలకలం రేపిన వివాహిత వీడియో.. తీవ్రంగా స్పందించిన పోలీసులు.. అసలేమైందంటే?

AP Crime News: ఓ యువకుడు.. వివాహితపై కన్నేశాడు.. తన కోరిక తీర్చాలంటూ నిత్యం వేధించడం మొదలుపెట్టాడు.. వివాహిత ఎదురు తిరగడంతో.. ఆమె భర్తకు లేనిపోని మాటలు చెప్పి..

అనంతపురంలో కలకలం రేపిన వివాహిత వీడియో.. తీవ్రంగా స్పందించిన పోలీసులు.. అసలేమైందంటే?
Crime News

AP Crime News: ఓ యువకుడు.. వివాహితపై కన్నేశాడు.. తన కోరిక తీర్చాలంటూ నిత్యం వేధించడం మొదలుపెట్టాడు.. వివాహిత ఎదురు తిరగడంతో.. ఆమె భర్తకు లేనిపోని మాటలు చెప్పి.. అతన్ని హింసించేలా ఉసిగొల్పాడు. అతని మాటలు విన్న భర్త.. భార్యను వేధించి పుట్టింటికి పంపాడు. అయినా.. యువకుడు వేధిస్తుండటంతో.. ఆమె సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. పెళ్లైన తనని ఒక యువకుడు వేధిస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో వివాహిత పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కలకలం రేపింది.

యల్లనూరు మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన యువతితో నల్లమాడ మండలానికి చెందిన వ్యక్తికి కొన్ని నెలల క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో కల్లూరు గ్రామానికి చెందిన నవీన్ తనను వేధించడం మొదలు పెట్టాడని బాధితులు తెలిపింది. ఈ మేరకు వివాహిత సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. యల్లనూరు మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన నవీన్ తన కోరిక తీర్చాలంటూ నవీన్ వేధిస్తున్నాడంటూ పేర్కొంది. తన భర్తకు లేనిపోని మాటలు చెప్పి పుట్టినింటికి పంపేలా చేశాడని పేర్కొంది. తాను ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని తనకు న్యాయం చేయాలని.. వీడియోలో తెలిపింది.

దీంతోపాటు వివాహిత నల్లమాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం వెంటనే స్పందించిన పోలీసులు పోకిరి నవీన్ ని అరెస్ట్ చేశారు. యవకుడిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లమాడ పోలీసులు తెలిపారు.

Also Read:

Andhra Pradesh Rains: వాయుగుండం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..

Published On - 8:32 am, Fri, 12 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu