Bigg Boss 5 Telugu: మరో వికెట్‌ పడేందుకు సమయం ఆసన్నమైంది.. ఈ వారం హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు.?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎపిసోడ్‌లు గడుస్తున్నా కొద్దీ ఒక్కో కంటెస్టెంట్‌ హౌజ్‌ను వదిలి పోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్‌ మాస్టర్‌, హమీదా...

Bigg Boss 5 Telugu: మరో వికెట్‌ పడేందుకు సమయం ఆసన్నమైంది.. ఈ వారం హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు.?
Bigboss 5 Telugu Nomination
Follow us

|

Updated on: Nov 12, 2021 | 5:51 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎపిసోడ్‌లు గడుస్తున్నా కొద్దీ ఒక్కో కంటెస్టెంట్‌ హౌజ్‌ను వదిలి పోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్‌ మాస్టర్‌, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ ఇలా.. తొమ్మిది మంది కంటెస్టెంట్స్‌ ఎలిమినేట్ అయ్యారు. దీంతో షో ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్‌ల సంఖ్య తగ్గుతున్నా కొద్దీ ఈసారి టైటిల్‌ ఎవరు కొడుతారన్న దానిపై ఆసక్తి పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో కంటెస్టెంట్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌ను వదిలి వెళ్లడానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం జరగబోయే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌ గుడ్‌బై చెప్పనున్నాడు. దీంతో ఎలిమినేట్‌ అయ్యేది ఈ కంటెస్టెంట్‌ అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు తెగ హల్చల్‌ చేస్తున్నాయి.

ఇక ఈ వారం నామినేషన్‌లో సిరి, రవి, సన్నీ, మానస్‌, కాజల్‌లు నామినేషన్‌లో ఉన్నారు. ఈ ఐదుగురిలో నుంచి కాజల్‌ హౌజ్‌ను వీడి వెళ్లనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి ఓ కారణాన్ని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా కాజల్‌ హౌజ్‌లో యాక్టివ్‌గా ఉండడం లేదని, ఆటలో వెనకబడిపోయిందని బలంగా వినిపిస్తోంది. హౌజ్‌మేట్స్‌ కూడా కాజల్‌ను వరస్ట్‌ ఫర్ఫామర్‌గా ఎన్నికుని జైలుకు పంపించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి హౌజ్‌ను వీడేది కాజల్‌ అన్న వార్తలకు బలం చేకూరింది.

ఇక నామినేషన్‌లో ఉన్న రవి, సన్నీలకు మంచి ఓటింగ్ వస్తుంది. కాబట్టి కాజల్‌, సిరిలో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని చర్చ జరుగుతోంది. అయితే షణ్ముఖ్‌ ఎలిమినేషన్‌లో లేడు కాబట్టి.. అతనికి పడాల్సిన ఓట్లన్నీ సిరికి పడతాయని, ఈ కారణంగానే కాజల్‌ కథ ఈసారి కంచికి చేరుతుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బిగ్‌బాస్‌ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. మరి కాజల్‌ నిజంగానే ఎలిమినేట్‌ అవుతుందా.? లేదా మరెవరైనా ఇంటి నుంచి వెళ్లిపోనున్నారా.? తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Puppy Dance: యజమాని ఎలా డ్యాన్స్ చేస్తే.. అలాగే చేస్తున్న కుక్కపిల్ల.. క్యూట్‌ డాన్స్‌.. వీడియో వైరల్‌

Afghanistan Blast: ఆఫ్ఘనిస్థాన్‌ లోని మసీదులో మళ్ళీ బాంబు పేలుడు.. సుమారు 12 మందికి గాయాలు..

Afghanistan Blast: ఆఫ్ఘనిస్థాన్‌ లోని మసీదులో మళ్ళీ బాంబు పేలుడు.. సుమారు 12 మందికి గాయాలు..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..