Afghanistan Blast: మళ్ళీ బాంబు పేలుడుతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్.. ముగ్గురు మృతి, 15మందికి గాయాలు
Afghanistan Blast: ఆఫ్ఘనిస్థాన్ మళ్ళీ బాంబుల మోతతో దద్దరిల్లింది. నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని స్పిన్ ఘర్ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో..
Afghanistan Blast: ఆఫ్ఘనిస్థాన్ మళ్ళీ బాంబుల మోతతో దద్దరిల్లింది. నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని స్పిన్ ఘర్ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. స్థానిక ముల్లాతో సహా కనీసం 15 మంది గాయపడ్డారని స్థానికులు చెప్పారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు మసీదు లోపలి భాగంలో పేలుడు పదార్థాలు పేలడంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
సెంట్రల్ కాబూల్‌లోని నవంబర్ 2న ఆఫ్ఘనిస్తాన్‌లోని అతిపెద్ద సైనిక ఆసుపత్రిపై ముష్కరులు దాడి చేయగా కనీసం 25 మంది మరణించారు. మరియు 50 మందికి పైగా గాయపడ్డారని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. అయితే ముష్కరులను తిరిగి 15 నిమిషాల్లోనే హతమార్చినట్లు పేర్కొన్నారు.
ఆగస్టు లో ఆఫ్గనిస్తాన్ తాలిబాన్ చేతిలోకి వెళ్లి.. ప్రభుత్వం ఏర్పరచినప్పటి నుంచి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. తరచుగా పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.
Also Read: నా పెళ్ళికి రండి.. భోజనం చేసి రూ. 7,300 చెల్లించండి .. పిల్లల్ని తీసుకుని రావద్దు.. కండిషన్స్ అప్లై.. ఎక్కడంటే.. అది ఇవ్వలేదంటూ మెడికల్ షాపు ఎదుట ఓ యువకుడు వీరంగం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు