AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: లక్ష్మీగూడలో ప్లాట్లకు భారీ డిమాండ్..! గరిష్ఠ ధర ఎంత పలికిందంటే..?

హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలో తెలంగాణ హౌసింగ్‌ బోర్డు నిర్వహించిన ఓపెన్ ప్లాట్ల పబ్లిక్ వేలం బుధవారం ఉత్సాహంగా సాగింది. వేలంలో 49 మంది బిడ్డర్లు పాల్గొనడం విశేషం. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. ..

Hyderabad: లక్ష్మీగూడలో ప్లాట్లకు భారీ డిమాండ్..! గరిష్ఠ ధర ఎంత పలికిందంటే..?
Govt Plots Auction
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Feb 19, 2026 | 9:26 PM

Share

హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలో తెలంగాణ హౌసింగ్‌ బోర్డు నిర్వహించిన ఓపెన్ ప్లాట్ల పబ్లిక్ వేలం బుధవారం ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో చదరపు గజానికి గరిష్ఠంగా రూ.51 వేల ధర పలికింది. మొత్తం 14 ప్లాట్లు వేలం ద్వారా విక్రయమై.. హౌసింగ్‌బోర్డుకు రూ.14.75 కోట్ల ఆదాయం లభించినట్లు వైస్‌చైర్మన్ వి.పి.గౌతమ్ వెల్లడించారు. ఈ ప్లాట్ల విక్రయానికి ఫిబ్రవరి 2న హౌసింగ్‌బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. వేలంలో మొత్తం 49 మంది బిడ్డర్లు పాల్గొనడం విశేషం. దీని ద్వారా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో నివాస అవసరాల కోసం ఓపెన్ ప్లాట్లకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది.

వేలానికి చదరపు గజానికి రూ.32 వేలుగా ఆఫ్సెట్ ధరను నిర్ణయించారు. అయితే గరిష్ఠంగా రూ.51 వేల బిడ్ నమోదు కాగా.. కనిష్ఠంగా విజయవంతమైన బిడ్ బేస్‌ ప్రైస్ అయిన రూ.32 వేలకే పరిమితమైంది. వేలంలో సగటు ధర చదరపు గజానికి రూ.44,285గా నమోదైంది. హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉండటం, మౌలిక సదుపాయాల అందుబాటు, కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంతో రాజేంద్రనగర్ ప్రాంతంలో ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని రియల్‌ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read:  ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

Follow Us