Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boy Alexa: అలెక్సాతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో..

Boy Alexa: అలెక్సాతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 13, 2021 | 8:41 AM

‘పిల్లలు…దేవుడు చల్లని వారే…కల్ల కపటమెరుగని కరుణామయులే’ అని ఓ సినీ కవి అన్నట్లు చిన్న పిల్లలు ఏ పని చేసినా చూడముచ్చటగా ఉంటుంది. నిష్కల్మషమైన మనసుతో చిరునవ్వులు చిందిస్తుంటే వారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.


‘పిల్లలు…దేవుడు చల్లని వారే…కల్ల కపటమెరుగని కరుణామయులే’ అని ఓ సినీ కవి అన్నట్లు చిన్న పిల్లలు ఏ పని చేసినా చూడముచ్చటగా ఉంటుంది. నిష్కల్మషమైన మనసుతో చిరునవ్వులు చిందిస్తుంటే వారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక అమెజాన్‌ వర్చువల్ అసిస్టెంట్‌ సాధనమైన ‘అలెక్సా’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడిగిన వెంటనే నచ్చిన పాటను ప్లే చేయడం, తాజా వార్తలు వినిపించడం… ఒకటేమిటి? దాదాపు మనుషులు చేసే అన్ని పనులు ఈ వర్చువల్‌ సాధనం చేస్తుంది. ఈ నేపథ్యంలో కబీర్ సూద్‌ అనే ఓ పిల్లాడు, అలెక్సాల మధ్య సాగిన సరదా సంభాషణ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆ చిన్నారి ముద్దు ముద్దు మాటలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలో సోఫా పైకెక్కిన కబీర్‌ మొదట ఓ హిందీ పాటను ప్లే చేయమని అలెక్సాను ముద్దుముద్దుగా అడుగుతాడు. స్పీకర్‌లో పాట వినిపించగానే సోఫా దిగి చిరునవ్వులు చిందిస్తాడు. కేరింతలు కొడతాడు. ఆ తర్వాత మరొక హిందీ పాటను అడుగుతాడు. కానీ ఈసారి ఆ పాటను అందుకోలేకపోతుంది అలెక్సా. అయినా వెనక్కు తగ్గకుండా మళ్లీ అదే పాటను అడుగుతాడు. ఇలా రెండు మూడుసార్లు అడిగిన తర్వాత కానీ తనకు నచ్చిన పాట వినిపించదు.. ఇలా అలెక్సాతో ఆ కబీర్‌ సాగించిన సంభాషణలను ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది అతడి తల్లి. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కబీర్ అమాయకపు చూపులు, ముద్దు ముద్దు మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Published on: Nov 13, 2021 07:53 AM