ఈ వ్యక్తి 70 పిల్లులతో కలిసి చిన్న గదిలో జీవిస్తున్నాడు..! కానీ చుట్టుపక్కల వారు ఇబ్బందిగా ఫీలవుతున్నారు..

Man Lives With 70 Cats: మానవులకు పెంపుడు జంతువులతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. కొంతమంది వాటిని కుటుంబ సభ్యుడిలా ఫీలవుతారు. వాటికేమైనా

ఈ వ్యక్తి 70 పిల్లులతో కలిసి చిన్న గదిలో జీవిస్తున్నాడు..! కానీ చుట్టుపక్కల వారు ఇబ్బందిగా ఫీలవుతున్నారు..
Man Lives With 70 Cats

Man Lives With 70 Cats: మానవులకు పెంపుడు జంతువులతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. కొంతమంది వాటిని కుటుంబ సభ్యుడిలా ఫీలవుతారు. వాటికేమైనా అయితే తట్టుకోలేరు. అవి కూడా అదేరీతిలో స్పందిస్తాయి. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. UKకు చెందిన ఓ వ్యక్తి తన చిన్న ఇంట్లో 70 పిల్లులతో కలిసి జీవిస్తున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం. అయితే పిల్లులపై ఇతడికి ఉన్న ప్రేమ ఇరుగు పొరుగు వారికి నచ్చడం లేదు. వారందరు ఇతడిని చూసి చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారు.

56 ఏళ్ల ఇయాన్ తన చిన్న ఇంట్లో 70 పిల్లులతో నివసిస్తున్నాడు. పిల్లులతో కలిసి జీవించమేంటని అడిగితే అతడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. తాను ఎపిలెప్సీ అనే వ్యాధితో బాధపడుతున్నానని అందుకే పిల్లులతో కలిసి జీవిస్తున్నానని చెప్పాడు. తాను మూర్ఛ పోయినప్పుడు పిల్లులు తనకు సహాయం చేస్తాయని చెప్పుకొచ్చాడు. ఇది మాత్రమే కాదు తనలాగే మూర్ఛరోగంతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా పిల్లులు సహాయం చేయగలవని ఇయాన్ చెబుతున్నాడు. ఎపిలెప్సీ అనేది నరాల పరిస్థితి/అస్తవ్యస్థ క్రమాన్ని తెలియజేసే వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తులు పదే పదే మూర్చ(ఫిట్స్)కు గురవుతుంటారు. మూర్చ వచ్చినపుడు సదరు రోగి అసాధారణంగా ప్రవర్తించడం, కొన్నిసార్లు ఇంద్రియ జ్ఞానాన్ని కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి.

అయితే ఇయాన్ జీవనశైలి అతని ఇరుగుపొరుగు వారికి తలనొప్పిగా మారింది. ఇయాన్ ప్రతిరోజూ తన పిల్లులను పరిసర ప్రాంతాల్లో వాకింగ్‌ కోసం తీసుకెళ్తాడు. ఈ విషయం చుట్టుపక్కల వారికి నచ్చడంలేదు. చాలా పిల్లులు బయటకు రావడంతో అవి చిన్న చిన్న సమస్యలకు కారణం అవుతున్నాయి. ఇది కాకుండా ఇయాన్ ఇంటి పైకప్పుపై పిల్లుల కోసం ఒక చిన్న ఇంటిని నిర్మించాడు. తద్వారా పిల్లులు ఎక్కడికీ వెళ్లలేవు. అయితే కొంతమంది జంతుప్రేమికులు ఇయాన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. వారి ప్రకారం.. ఇన్ని పిల్లులను అంత చిన్న ప్రదేశంలో బంధించడం వాటిని హింసించడమే అవుతుందని అంటున్నారు.

క్రిస్‌గేలా మజాకా..! బ్యాట్‌ రెండు ముక్కలైంది.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

AP Covid19: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కలవరం.. మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. కొత్తగా 11 మంది మృత్యువాత

Two Headed Snake: అదృష్టాన్ని తెచ్చే రెండు తలల పామంటూ అమ్మకానికి యత్నం.. పోలీసుల ఎంట్రీతో..

Click on your DTH Provider to Add TV9 Telugu