Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి గాయం!.. ఆల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి(వీడియో): America Attacks

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి గాయం!.. ఆల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి(వీడియో): America Attacks

Anil kumar poka

|

Updated on: Sep 15, 2021 | 10:50 AM

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి గాయం అది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా.. అతి శక్తివంతమైన దేశంగా కీర్తినందుకుంటున్న అమెరికాను చావుదెబ్బ తీసిన రోజు అది. అగ్రరాజ్యాన్నే సవాల్ చేసిన ఉగ్రమూకల ఆకృత్యానికి నిదర్శనం ఆరోజు..

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి గాయం అది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా.. అతి శక్తివంతమైన దేశంగా కీర్తినందుకుంటున్న అమెరికాను చావుదెబ్బ తీసిన రోజు అది. అగ్రరాజ్యాన్నే సవాల్ చేసిన ఉగ్రమూకల ఆకృత్యానికి నిదర్శనం ఆరోజు. అమెరికాలో విమానాలతో దాడి చేసి వేల మందిని చంపిన ‘ఆల్ ఖైదా’ ఉగ్రసంస్థ దుశ్చర్యను మరిచిపోని రోజు .. ఆ విషాద జ్ఞాపకాలు ఇంకా అమెరికాను వెంటాడుతూనే ఉన్నాయి.

2001 సెప్టెంబర్ 11.. ఈ తేదీ గురించి వినగానే ప్రతీ అమెరికన్ గుండెలో దడ పుడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ తేదీ గురించి ఇప్పటికీ చర్చ సాగుతోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికాని ఆ దేశ నడిబొడ్డున ఉన్న ప్రధాన టవర్లను ఉగ్రవాదులు కూల్చేశారు. రక్షణ విషయంలో ఎంతో పకడ్బందీగా ఉండే అమెరికాలోనే ఇంతటి ఘోరం జరగడం ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసింది. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నఆ సమయంలో జరిగిన ఈ దాడుల తరువాత అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఉగ్రవాద పోరుకు నడుం బిగించింది. ఇటీవల అఫ్గాన్ల విషయంలో అమెరికా తీరు చూశాక ఈ తేదీపై మరోసారి చర్చకు వచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ ట్విన్‌ టవర్స్ మీద సెప్టెంబర్‌ 11న దాడులు జరిగి నేటికి 19 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. 2001 సంవత్సరం సెప్టెంబరు 11న అమెరికా దేశంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఆల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడులు చరిత్ర మరవలేదు. ఒక్క అమెరికాయే కాదు ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఒసామా బిన్ లాడెన్ బృందం పక్కా వ్యూహంతో జరిపిన దాడులవి. ఆ రోజు ఉదయం 10 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు.. నాలుగు ప్రయాణికుల జెట్ విమానాలను దారి మళ్లించి న్యూయార్క్ ట్విన్‌ టవర్స్ పైన దాడికి పాల్పడ్డారు.

ఇదిలావుంటే, 2001 సెప్టెంబర్ 11న నాలుగు ప్రయాణికుల విమానాలను ఇస్లామిస్ట్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఆ విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తోపాటు, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. అనుకోకుండా జరిగిన దాడితో.. చూస్తుండగానే, న్యూయార్క్ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. బహుళ అంతస్తులతో కూడిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను రెండు విమానాలు ఢీకొన్నప్పుడు సుమారు 10,000 గ్యాలన్ల జెట్ ఇంధనం ఎగజిమ్మింది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడుల్లో మూడు వేల మంది అశువులుబాసారు. ఇందులో నాలుగు విమానాలకు సంబంధించి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది, సాధారణ పౌరులు ఉన్నారు. అలాగే, సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసులు కలిపి 836 మంది మరణించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : News Watch: మృగాడిని పట్టిస్తే 10 లక్షలు.| జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్..? మరిన్ని వార్తా కధనాలు వీక్షించండి(వీడియో).

 అమ్మానాన్నలకు నీరజ్ సూపర్ సర్‌ప్రైజ్..! టోక్యో ఒలంపిక్స్ తరువాత కూడా..(వీడియో): Neeraj Chopra

 అంతరిక్షంలో అగ్నిప్రమాదం..! వైరల్ అవుతున్న వీడియో..: Fire in space Video.

 తిరుపతి మార్కెట్‌లో ఒక్కసారి రెండు నాగుపాములు ప్రత్యక్షం..! హడలెత్తించే వీడియో..: Snakes Video.

Published on: Sep 15, 2021 10:36 AM