Viral Video: బావిలో బిడ్డ.. ప్రాణం అడ్డేసి కాపాడిన తల్లి కోతి.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్ అంటారు..!
Viral Video: ఈ దునియా మొత్తంలో తల్లి ప్రేమను మించింది మరోటి లేదు. మనిషైనా.. జంతువైనా.. తల్లిప్రేమ ముందు మరేదీ సాటి రాదు. తమ బిడ్డకు ఆపద వాటిల్లిందంటే చాలు..
Viral Video: ఈ దునియా మొత్తంలో తల్లి ప్రేమను మించింది మరోటి లేదు. మనిషైనా.. జంతువైనా.. తల్లిప్రేమ ముందు మరేదీ సాటి రాదు. తమ బిడ్డకు ఆపద వాటిల్లిందంటే చాలు.. కన్నతల్లి తన బిడ్డ కోసం ఎంతవరకైనా వెళ్తుంది. ఇదే విషయాన్ని తాజాగా ఓ వానరం మరోసారి రుజువు చేసింది. అమ్మ ప్రేమంటే.. ఇంత అద్భుతంగా ఉంటుందా? ఇంతలా ప్రొటెక్ట్ చేస్తుందా? అనేలా ఓ ఘటన చోటుచేసుకుంది. తన చేష్టలతో అందరికీ విసుగు తెప్పించే ఓ కోతి.. తల్లిగా తాను చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ తల్లికోతి తన బిడ్డను కాపాడుకునేందుకు ప్రాణాలనే పనంగా పెట్టింది. ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో కోతి ఓ బావి మీద నిల్చుని.. అందులోకి తొంగి చూస్తోంది. ఏదో ఆందోళనగా ఉన్నట్లు దాని ముఖ కవిళికలు స్పష్టం చేస్తున్నాయి. అవును దాని పిల్ల ఈ బావిలో పడిపోయింది. ఆ కారణంగానే ఆ తల్లికోతి తల్లడిల్లిపోతోంది. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన పిల్ల కోతి అందులో విలవిల్లాడుతుంది. ఇక అది చూసిన తల్లి కోతి మనసు తల్లడిల్లిపోయింది. దీంతో తన బిడ్డను ఎలాగైనా సరే కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. ప్రమాదం అని తెలిసినా సరే.. తన బిడ్డను రక్షించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. బావిలోకి దిగింది. చేతులో బావి గట్టును పట్టుకుని వేలాడుతూ బిడ్డను రక్షించేందుకు ప్రయత్నం చేసింది. ఏం చేయాలో తెలియక.. తన తోకను బావిలోకి వదిలింది. అలా తల్లి తోక పట్టుకుని ఆ పిల్ల కోతి నెమ్మదిగ ఒడ్డుకు చేరింది. మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనికి చూసి ఫిదా అయిపోతున్నారు. కోత్తి చూపి తల్లి ప్రేమకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Viral Video:
Also read:
Zomato: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నుంచి సీఈవో గౌరవ్ గుప్తా రాజీనామా.. కారణం ఏంటంటే..!
Bigg Boss 5 Telugu: పంథం నీదా నాదా సై.. శ్రుతిమించిన ఆటతీరు.. మెడికల్ రూమ్‌కు కంటెస్టెంట్..