అంతరిక్షంలో అగ్నిప్రమాదం..! వైరల్ అవుతున్న వీడియో..: Fire in space Video.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో అంతరిక్ష కేంద్రంలో పొగ వ్యాపించడంతో స్మోక్ అలారమ్‌లూ మోగాయి. ఈ ఘటన స్పేస్ స్టేషన్‌లో ఉన్న రష్యా మాడ్యూల్‌లో జరిగింది.
కక్ష్యలో అవుట్ పోస్టుకు చేరుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పొగలు కమ్ముకున్నాయి. జ్వెజ్‌దా మ్యాడూల్‌లోనే ఆస్ట్రోనాట్లు నివసించే క్వార్టర్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో అంతరిక్ష కేంద్రంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాలం చెల్లిన హార్డ్‌వేర్, సిస్టమ్స్‌లో సమస్యలు తలెత్తడం కారణమని ఓ రష్యా అధికారి హెచ్చరించారు. ఆటోమేటిక్ బ్యాటరీ చార్జింగ్ అవుతున్న సమయంలో పొగను స్మోక్ డిటెక్టర్ గుర్తించడంతో అలారం మోగింది. సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బ్యాటరీలను రీచార్జింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రోనాట్లు పొగను గుర్తించారు. వాళ్లు ప్లాస్టిక్ కాలిన వాసనను గుర్తించి అప్రమత్తం అయ్యారు. ఫిల్టర్‌ను ఆన్ చేసిన తర్వాత అక్కడ గాలి క్లీనైట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఫిక్స్ చేసిన సమయం ప్రకారమే స్పేస్‌వాక్ ఉంటుందని నాసా వెల్లడించింది. ఇటీవలే స్పేస్ స్టేషన్‌కు నౌక సైన్స్ మాడ్యూల్‌ను రష్యా పంపించింది. ప్రస్తుతం దాన్ని ఇద్దరు కాస్మోనాట్స్ ఫిక్స్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : తిరుపతి మార్కెట్‌లో ఒక్కసారి రెండు నాగుపాములు ప్రత్యక్షం..! హడలెత్తించే వీడియో..: Snakes Video.
ఓల్డ్ ఫొటోస్ ట్రెండ్.. ఈ స్టార్‌ను గుర్తుపట్టారా..? క్లూ కావాలా..?(వీడియో): Remember This Actor.
ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. తొందర్లో గ్రాండ్ రిలీజ్..!(వీడియో): Acharya movie Video.
Saidabad Horror : నిందితుని కోసం రంగంలోకి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. 100కి పైగా పోలీసులు…