Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Two Headed Snake: అదృష్టాన్ని తెచ్చే రెండు తలల పామంటూ అమ్మకానికి యత్నం.. పోలీసుల ఎంట్రీతో..

Two Headed Snake: రెండు తలల పామును విక్రయిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్‌లోని అటవీశాఖ విజిలెన్స్ అధ్గికరులు పట్టుకున్నారు. రెడ్ శాండ్ గోవా పేరుతో పిలిచే..

Two Headed Snake: అదృష్టాన్ని తెచ్చే రెండు తలల పామంటూ అమ్మకానికి యత్నం.. పోలీసుల ఎంట్రీతో..
Two Head Snake
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 15, 2021 | 8:37 PM

రెండు తలల పామును విక్రయిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్‌లోని అటవీశాఖ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. రెడ్ శాండ్ గోవా పేరుతో పిలిచే రెండు తలల పామును ఘట్‌కేసర్ అటవీ ప్రాంతంలో కొంతకాలంగా ఈ ముఠా సభ్యులు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పామును ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, గుప్త నిధులు దొరుకుతాయానే అపోహను ప్రచారంలో పెట్టారు.

విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న అటవీశాఖ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి పాము కొనుగోలుదారులుగా ఆపరేషన్ సాగించారు. పాములను అమ్మే ప్రయత్నంలో ఉండగా.. పోలీసులు ఆ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు నాలుగున్నర కేజీల బరువుతో బలంగా ఉన్న ఈ పామును డెభై లక్షలకు అమ్ముతామంటూ నలుగురు సభ్యుల ముఠా బేరం పెట్టింది. అనేక సార్లు ఆపరేషన్ చేస్తున్న అధికారులను ఏమార్చే ప్రయత్నం చేస్తూ చివరకు ఈసీఐఎల్ సమీపం నాగారంలో ఓ ఇంట్లో దొరికిపోయారు. సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ. ఆంజనేయ ప్రసాద్ అనే నలుగురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న ఓ కారును, టూ వీలర్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరినీ మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు.

కాగా, రెండు తలల పాము వట్టి అపోహ మాత్రమేనని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆ పాము ద్వారా అదృష్టం, గుప్త నిధులు కలిసి రావడం అనేది వట్టి పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అలా ప్రచారం చేస్తూ డబ్బు చేసుకునే ముఠాల మాటలు ప్రజలు నమ్మవద్దని తెలిపారు. పామును అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు.

Read Also: బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్