బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..
ఒక్కోసారి కొన్ని సంఘటనలు వింటే.. నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు. అందులోనూ ఇటువంటి సంఘటనల గురించి తెలిసినపుడు భలే అనిపిస్తుంది. ఒక వ్యక్తి తనకు ప్రధాని మోడీ నుంచి డబ్బులు వచ్చాయని చెబుతున్నాడు.. ఈ కథ ఏమిటో మీరూ ఓ లుక్కేయండి
Bank Transaction: ఆ డబ్బు నాకు మోడీ బ్యాంకులో వేశారు.. నేను ఇవ్వను.. అంటూ మడత పేచీ పెడుతున్నాడు ఓ వ్యక్తి. అప్పట్లో ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలోకీ 15 లక్షల రూపాయలు వస్తాయని ప్రధాని మోడీ చెప్పినట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కారణాన్ని చూపిస్తూ ఓ వ్యక్తి తన ఖాతాలోకి పొరపాటుగా జమ అయిన సొమ్మును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు. బ్యాంక్ అధికారులను..పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అసలేం జరిగిందంటే..
బీహార్‌లోని ఖగారియాలోని ఒక గ్రామీణ బ్యాంకు నుంచి పొరపాటుగా ఆ జిల్లాలోని మన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భక్తియార్‌పూర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్‌కు డబ్బు జమ అయింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 5.5 లక్షల రూపాయలు అతని ఎకౌంట్ కు చేరిపోయాయి. బ్యాంకు అధికారులు తప్పును గుర్తించి ఆ వ్యక్తికి నోటీసులు పంపించింది. వాటికి అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో సదరు బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు రంజిత్ దాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
అది బ్యాంకు సొమ్ము బాబూ తిరిగి ఇచ్చేయాలి. అది పొరపాటుగా నీ ఎకౌంట్ కు వచ్చింది అని చెప్పారు. అయితే, రంజిత్ మాత్రం డబ్బు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ” ఈ డబ్బు నాకు ప్రధాని మోడీ పంపించారు.” అని చెప్పాడు. దాంతో పోలీసులు, బ్యాంకు అధికారులు అవాక్కయ్యారు.. ప్రధాని నీకు డబ్బు పంపడమేమిటి బాబూ అని పోలీసులు ప్రశ్నిస్తే..”ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరికీ 15 లక్షల రూపాయలు బ్యాంకుకు నేరుగా వేస్తామని ప్రధాని చెప్పారు. ఇప్పుడు నాకు వచ్చిన మొత్తం కూడా అందులో భాగంగానే వచ్చింది. ఇది మొదటి విడత సొమ్ము. అందుకే నేను ఖర్చు చేసేశాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు.” అంటూ రంజిత్ చెప్పుకొచ్చాడు. దీంతో అందరికీ పూర్తిగా మతిపోయింది.
మాన్సి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీపక్ కుమార్ ఈ విషయంపై ఇలా చెప్పారు..”బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుపై రంజిత్ దాస్‌ను మేము అరెస్టు చేశాము. తదుపరి విచారణ కొనసాగుతోంది.”
ఇవి కూడా చదవండి:
Doordarshan: మన టీవీకి 62 ఏళ్లు.. దూరదర్శన్‌గా మొదలైన అడుగులు.. ఇప్పుడు నెట్‌వర్క్ నీడలో పరుగులు..
Space Tour: అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆ నలుగురు.. ఎందుకోసం.. ఎప్పుడు.. తెలుసుకుందాం..