- Telugu News Spiritual Statue of Equality Inauguration Invitation to Union Ministers by Chinna Jeeyar Swamy, and My home Group Chairman Dr. Jupally Rameshwar Rao
సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.. కేంద్ర మంత్రులకు చిన్నజీయర్ స్వామి ఆహ్వానం..
Statue of Equality: స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ! సమత.. మమత.. ఆధ్మాత్మికత..! విశ్వమానవాళి శ్రేయస్సు ఆకాంక్షిస్తూ చేపట్టిన బృహత్కార్యం
Venkata Narayana | Edited By: Ravi Kiran
Updated on: Sep 15, 2021 | 8:52 PM

తెలుగు నేల పులకించే వేళ. విశ్వనగరం హైదరాబాద్ సిగలో ఆధ్మాత్మిక ఝరి. భగవద్రామానుజుల మంగళాశాసనాలతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి సత్ సంకల్పం సాకారమయ్యే సమయం ఆసన్నమవుతోంది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి నిలువెత్తు నిదర్శనం సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగనున్నాయి. ఈ మహోత్సవ ఘట్టానికి రావాలని దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు స్వయంగా అందిస్తున్నారు చినజీయర్ స్వామి. ఈ బృహత్క్యార్యానికి రావాలంటూ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు.

సహస్రాబ్ది విశిష్ట వేడుకల్లో భాగస్వామ్యులు కావాలని రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను వారి నివాసాలకు వెళ్లి చిన జీయర్ స్వామి ఆహ్వానం పలికారు. కేంద్రమంత్రులు అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజే, నితిన్ గడ్కరీలకు ఆహ్వాన పత్రాలు అందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆహ్వానం అందచేశారు. చినజీయర్ స్వామితోపాటు మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు ఉన్నారు.

శంషాబాద్ ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 02 నుంచి 14 వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుక మహోత్సవాలు కొనసాగుతాయి. భగవద్రామానుల మహా విగ్రహావిష్కరణ సహా 108 దివ్య దేశాలు కనులవిందు చేయనున్నాయి. 200 ఎకరాల్లో సువిశాల స్థలంలో.. వెయ్యికోట్ల వ్యయంతో నిర్మించిన 216 అడుగుల భగవద్రామానుజ పంచలోహ మహా విగ్రహా ఆవిష్కరణకు ఆహ్వానాలు పలుకుతున్నారు.

సహస్రాబ్ది విశిష్ట వేడుకల్లో భాగస్వామ్యులు కావాలని రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను వారి నివాసాలకు వెళ్లి చిన జీయర్ స్వామి ఆహ్వానం పలికారు. కేంద్రమంత్రులు అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజే, నితిన్ గడ్కరీలకు ఆహ్వాన పత్రాలు అందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆహ్వానం అందచేశారు. చినజీయర్ స్వామితోపాటు మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు ఉన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే భగవత్ రామానుజ విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా సహస్రకుండాత్మక లక్ష్మీ నారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేస్తారు. ఇందుకోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యితోపాటు ఇతర హోమద్రవ్యాలు వినియోగించనున్నారు. ఈ బృహత్కార్యానికి అతిరథమహారథులను ఆహ్వానిస్తున్నారు చిన జీయర్ స్వామి.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఆహ్వాన పత్రం..ఆయన వెంట శ్రీనివాస రామానుజం, మైహోం గ్రూపు ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు.