Zodiac Signs: ఈ రాశుల వారికి తప్పులు వెతకటం.. ఫిర్యాదులు చేయడమే పని.. ఏ రాశుల వారో తెలుసా?

మనుషుల వ్యక్తిత్వాలను లెక్క వేయడం చాలా కష్టమైన పని. ఎదుటి వారు ఎలా ఉంటారు అనేది వారితో ఎంతో కాలం కలిసి ప్రయాణం చేస్తేనే కానీ తెలీదు. కొందరు వ్యక్తులు చూసిన వెంటనే ఆత్మీయుల్లా అనిపిస్తారు.

Zodiac Signs: ఈ రాశుల వారికి తప్పులు వెతకటం.. ఫిర్యాదులు చేయడమే పని.. ఏ రాశుల వారో తెలుసా?
Zodiac Signs
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2021 | 11:23 AM

Zodiac Signs: మనుషుల వ్యక్తిత్వాలను లెక్క వేయడం చాలా కష్టమైన పని. ఎదుటి వారు ఎలా ఉంటారు అనేది వారితో ఎంతో కాలం కలిసి ప్రయాణం చేస్తేనే కానీ తెలీదు. కొందరు వ్యక్తులు చూసిన వెంటనే ఆత్మీయుల్లా అనిపిస్తారు. కొందరు అందుకు విరుద్ధంగా అనిపిస్తారు. అయితే, ఆ వ్యక్తులతో మన ప్రయాణం మొదలయ్యాక ఇదంతా రివర్స్ అవడం చాలామందికి అనుభవమే.  కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ ప్రతి విషయంలోనూ తప్పులు వెదికే ప్రయత్నం చేస్తారు. అక్కడితో ఆగకుండా.. చిన్న చిన్న తప్పులను కూడా ప్రశ్నిస్తారు. లేదా ఫిర్యాదులు చేస్తారు. వీరికి అసంతృప్తిగా ఉండటం..తమ అసంతృప్తిని పదిమంది వద్దా వ్యక్తం చేయడం చాలా ఎక్కువ అలవాటుగా ఉంటుంది. ఇది ఇతరులను ఎంత బాధిస్తుంది అనే విషయం కూడా వారికీ తెలీదు. ఇటువంటి వారితో కలిసి తిరిగినపుడు వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం మన వ్యక్తిత్వాన్ని మన రాశి చక్రం ప్రకారం తెలుసుకోవచ్చు. మన రాశికి మన వ్యక్తిత్వానికీ దగ్గర సంబంధం ఉందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.

కొన్ని రాశుల వారు పైన చెప్పిన విధంగా అందరిలోనూ.. అన్ని విషయాల్లోనూ తప్పులు వెదికే పనిలో ఉంటారు. అంతేకాకుండా ఈ తప్పులను ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా ఉండే ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటకం 

కర్కాటక రాశి వ్యక్తులు ఎల్లప్పుడూ వారి కోపాన్ని, భావోద్వేగాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.  వారు దానిని బయటకు పంపడానికి ఒక అవుట్‌లెట్‌ను వెతుక్రుకుంటారు. అదే వారు ఫిర్యాదు చేయడానికి  అవసరమైన విషయాలను వెతుక్కోవడం. వ్యక్తులలో లోపాలు వెదికే పనిలో వారు తమ ఎమోషన్స్ ను బయటకు నేట్టీస్తారు.

కన్య

కన్యారాశి వారు పరిపూర్ణతకు పర్యాయపదంగా ఉంటారు. సహజంగానే, వారు ప్రతిచోటా ఏదో తప్పును కనుగొంటారు.  చిన్న తప్పులనూ ఫిర్యాదు చేస్తారు. వారికి కనిపించిన ఏ తప్పునైనా కానీ, ఫిర్యాదు చేయకుండా వారు ఉండలేరు.

వృశ్చికరాశి

వృశ్చిక రాశికి చెందిన వారు అంతా బాగుండాలని కోరుకుంటారు. వీరు గందరగోళాన్ని ఇష్టపడరు.  విషయాలు తన కంట్రోల్ లో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. అలా జరగనపుడు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో తెలియదు. ఎక్కువ సార్లు వారికీ ఏదైనా విషయం నచ్చకపోతే దాని గురించి పెద్దగా శబ్దం చేస్తారు.  వీరు విషయాన్ని చిన్నగా తెలిపోవాలని అనుకోరు. చిన్న తప్పుకు కూడా పెద్ద హంగామా సృష్టించేసి అందరినీ గందరగోళంలోకి నెట్టేస్తారు.

కుంభం

వారు తెలివైన, శ్రద్ధగల వ్యక్తులు. కుంభరాశి ప్రజలు ప్రతిదానిలో లోపాలను కనిపెడుతూనే ఉంటారు. విషయం చక్కగా ఉండాలని వారు భావిస్తారు. అదేవిధంగా ఎక్కడైనా వారికి లోపం కనిపిస్తే దాని గురించి చెప్పకుండా ఉండలేరు. ఎదో విధంగా దానిని అవతలి వారికీ చెప్పాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వీరు ఇరుకున్ పడుతుంటారు. ఎదుటి వారిని ఇరుకున పాడేస్తారు.

ఈ రాశుల వారు అన్ని పనులను వారి వ్యక్తిత్వం ఆధారంగా చేస్తారు.  అవి ఆచరణాత్మకమైనవి లేదా ఆచరణాత్మకమైనవి కావు ఏదైనా సరే.  అయితే, దాని ఆధారంగా ప్రజలు ఆ రాశిచక్రాన్ని సంప్రదిస్తారు లేదా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ ఐదు రాశుల వారు ఎల్లప్పుడూ ప్రజలకు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు.

గమనిక- ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇది ఇక్కడ  ఇవ్వడం జరిగింది.