Horoscope Today: ఈ రాశి వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.. ఖర్చులు పెరుగుతాయి..!
Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది....
Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. సెప్టెంబర్ 16 (గురువారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. జీవిత భాగస్వామితో కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది.
వృషభ రాశి:
ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశాలుంటాయి. మానిసక సమస్యలు తొలగుతాయి.
మిథున రాశి:
మానసిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. అనవసరమైన ఖర్చులను నివారించడం మంచిది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు ఉంటాయి.
కర్కాటక రాశి:
వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహ రాశి:
రాజకీయ రంగంలో ఊహించని విధంగా విజయాలు ఉంటాయి. పోటీ రంగంలో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు మెరుగ్గా ఉంటాయి.
కన్య రాశి:
సమయాన్ని వృథా చేసుకోకూడదు. బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
తుల రాశి:
నూతన ఆయాదాన్ని సమకూర్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి నుంచి సహకారం అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
వృశ్చిక రాశి:
వ్యాపారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
ధనుస్సు రాశి:
ఇంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి మాట పట్టింపులు వచ్చే అవకాశాలుంటాయి. వీలైనంత త్వరగా వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మకర రాశి:
వ్యాపారాలలో అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
కుంభ రాశి:
చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలు విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశం.
మీన రాశి:
ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. బంధు, మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి.