Hair Care Tips: హెన్నా వల్ల జుట్టు పొడిబారుతుందా..! అయితే ఈ 4 రెమిడిస్ తెలుసుకోండి..
Hair Care Tips: ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తోంది. దీంతో చాలామంది ఈ వెంట్రుకలను దాచడానికి కలర్స్ లేదా హెన్నా వేసుకుంటారు.
Hair Care Tips: ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తోంది. దీంతో చాలామంది ఈ వెంట్రుకలను దాచడానికి కలర్స్ లేదా హెన్నా వేసుకుంటారు. అయితే కలర్స్‌లో ఉండే రసాయనాల కారణంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. మరోవైపు న్యాచ్‌రల్ హెన్నా వేయడం వల్ల కూడా జుట్టు పొడిబారుతుంది. క్రమంగా జుట్టు నాశనమవుతోంది. ఈ క్రమంలో మీరు జుట్టును కాపాడాలంటే లోతైన కండిషనింగ్ చేయడమే ఏకైక మార్గం. అందుకోసం ఏం చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం.
1. జుట్టు పొడిబారడాన్ని తగ్గించడానికి అరటిపండు ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది. దీని కోసం అరటిపండు, కలబంద, రెండు చెంచాల హెయిర్ ఆయిల్ తీసుకుని మిక్సీలో వేసి చాలా మెత్తని పేస్ట్ లాగా చేయాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసి అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత జుట్టును కడగాలి. అరటి జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. మృదువుగా చేస్తుంది.
2. జుట్టుకు తేమ అందించడానికి పెరుగు కూడా ఉత్తమ ఎంపికగా చెబుతారు. మీరు రెండు చెంచాల ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెను ఒక గిన్నె పెరుగులో వేసి, కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేయాలి. అరగంట పాటు జుట్టుకు అప్లై చేసి తేలికపాటి షాంపూతో కడగాలి. దీనివల్ల మీ జుట్టు లోతైన కండిషనింగ్ పొందుతుంది మృదువుగా మారుతుంది.
3. గుడ్డులోని తెల్లసొన, ఒక చెంచా ఆలివ్ నూనె, ఒక చెంచా తేనె, రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా వెనిగర్ మిక్స్ చేయాలి. దానిని జుట్టుకు అప్లై చేయాలి. సుమారు 20 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి. ఇది మీ జుట్టు పొడిబారడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
4. మీరు హెన్నా వేసినప్పుడల్లా దానికి ఆమ్లా పౌడర్ కలపండి. అందులో పెరుగు లేదా గుడ్డు తెల్ల సొన మిక్స్ చేయండి. తర్వాత హెన్నాను జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారదు. అంతేకాదు జుట్టుకు సహజ సిద్దమైన మెరుపు ఏర్పడుతుంది. కావాలంటే గోరింటాకులో ఆమ్లా ఆయిల్ లేదా బాదం నూనె కూడా కలపవచ్చు. ఇది చాలావరకు జుట్టును పొడిబారడం నుంచి తగ్గిస్తుంది.