AP Crime Record: ఏపీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక.. తెలంగాణలో నేరాలు పెరిగితే ఏపీలో పదిహేను శాతం తగ్గాయి
AP Crime Record: ఏపీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో తెలంగాణలో నేరాలు పెరిగితే ఏపీలో మాత్రం పదిహేను శాతం తగ్గాయి. ఏపీ
AP Crime Record: ఏపీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో తెలంగాణలో నేరాలు పెరిగితే ఏపీలో మాత్రం పదిహేను శాతం తగ్గాయి. ఏపీ వ్యాప్తంగా నమోదు చేసిన క్రైమ్ కేసుల వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. 2019తో పోలిస్తే ఏపీలో15 శాతం కేసులు తగ్గాయి. 2020లో 88,377 కోవిడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 2020లో 49,108 ఇసుక, అక్రమమద్యం తరలింపు కేసులు నమోదయ్యాయి. ఏపీలో 2019లో 870 హత్యలు జరిగాయి. 2020లో 853 హత్యలు జరిగాయి. 2 శాతం కేసులు తగ్గాయి. 2019లో మహిళలపై నేరాలు17,746 కేసులు నమోదైతే.. 2020లో 17,089 కేసులు నమోదయ్యాయి. ఇందులో 4శాతం తగ్గాయి. 2019లో ఏపీలో ఎస్సీ, ఎస్టీలపై 2,401 కేసులు నమోదైతే 2020లో 2270 నమోదయ్యాయి. 3 శాతం కేసులు తగ్గాయి.
2019లో కిడ్నాప్, మిస్సింగ్ కేసులు 902 నమోదయ్యాయి. 2020లో 737 కేసులు నమోదయ్యాయి. ఏకంగా 18 శాతం తగ్గాయి. 2019లో ఏపీలో రోడ్డు ప్రమాదాలు 14,700 నమోదైతే 2020లో12,830 నమోదయ్యాయి. 13 శాతం తగ్గాయి. 2019లో సైబర్ క్రైమ్ కేసులు1886 నమోదైతే 2020లో1899 నమోదయ్యాయి. ఇందులో 1 శాతం కేసులు పెరిగాయి. 2019లో ఏపీలో ప్రాపర్టీ క్రైమ్ డెకాయిట్ కేసులు 40 నమోదయ్యాయి. 2020లో39 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2 శాతం తగ్గాయి. 2019లో దోపిడీ కేసులు 310 నమోదైతే 2020లో 237 కేసులు నమోదయ్యాయి. 24 శాతం తగ్గాయి. 2019లో చోరీలు11,301 కేసులు నమోదైతే 2020లో 9,508 కేసులు వచ్చాయి. 16 శాతం తగ్గాయి.
2020లో ఏపీ పోలీసులకు స్పందన యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వారు -45,578 మంది. ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది 10,544. దిశ యాప్ ద్వారా ఫిర్యాదుల సంఖ్య – 671 ఇందులో 135 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఏపీ పోలీస్ సేవా మొబైల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు – 3,887, 119 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. సైబర్ మిత్ర వాట్సప్ ద్వారా 2436 ఫిర్యాదులు వస్తే 353 కేసులు నమోదయ్యాయి. 112 కి డయల్ చేసి ఫిర్యాదు చేసిన వారి సంఖ్య 10,816 కాగా 317 కేసులు నమోదయ్యాయి. డయల్ 100 కి 2,10,025 కేసులు వస్తే ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసినవి 6123 కేసులు. ఏపీ వ్యాప్తంగా 17,591 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.