Viral Pic: మీ కళ్లకు ఇదొక పరీక్ష.. ఈ ఫోటోలో సింహం దాక్కుంది.. ఎక్కడుందో తెలుసా?

Viral Pic: ఫోటో పజిల్.. సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్. ఎక్కడ చూసినా ఇవే.. అందులో ఏదో జంతువు ఉంది.? అదెక్కడుందో..

Viral Pic: మీ కళ్లకు ఇదొక పరీక్ష.. ఈ ఫోటోలో సింహం దాక్కుంది.. ఎక్కడుందో తెలుసా?
Lion
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 15, 2021 | 9:52 PM

సోషల్ మీడియా ప్రపంచం ఎన్నో వింతలూ-విశేషాలకు నిలయం. నిత్యం ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రపంచం నలమూలల జరిగిన విశేషాలన్నీ కూడా క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అవుతుంటాయి. అలాగే మన ఖాళీ సమయాన్ని బోర్ కొట్టకుండా చూసుకునేందుకు పజిల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఫోటో పజిల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

ఫోటో పజిల్.. సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్. ఎక్కడ చూసినా ఇవే.. అందులో ఏదో జంతువు ఉంది.? అదెక్కడుందో కనిపెట్టండంటూ నిత్యం నెటిజన్లకు కొన్ని ఫోటో పజిల్స్ సవాల్ విసురుతున్నాయి. కొంతమంది అయితే వీటి కోసం ఏకంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో సొంతంగా పేజీలు కూడా రన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ మృగరాజు ఎంచక్కా సేద తీరుతోంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. తీక్షణంగా మీరు ఫోటోపై ఓ లుక్కేస్తే సింహాన్ని కనిపెట్టేయొచ్చు. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ఓ ట్రయిల్ వేయండి. ఒకవేళ కనిపెట్టలేకపోతే సమాధానం కోసం క్రింద వీడియోపై క్లిక్ చేయండి.