Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumaith Khan: డ్రగ్స్‌ కేసులో ముగిసిన ముబైత్‌ ఖాన్‌ ఈడీ విచారణ.. 7 గంటల విచారణలో ఏం తేలిందంటే..

Mumaith Khan: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులకు..

Mumaith Khan: డ్రగ్స్‌ కేసులో ముగిసిన ముబైత్‌ ఖాన్‌ ఈడీ విచారణ.. 7 గంటల విచారణలో ఏం తేలిందంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 15, 2021 | 5:53 PM

Mumaith Khan: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణంలో భాగంగా పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రవితేజ, నవదీప్‌, రానా దగ్గుబాటి, నందులను ఇప్పటికే ఈడీ విచారించింది. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌ ఈడీ కస్టడీలో ఉన్నాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా నటి ముమైత్‌ ఖాన్‌ను కూడా విచారించారు. బుధవారం ఉదయం మొదలైన విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 7 గంటల పాటు జరిపిన విచారణలో అధికారులు ముమైత్‌ ఖాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించరాని తెలుస్తోంది. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు ముమైత్‌కు ముంబయిలో రెండు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఆమె జరిపిన లావాదేవీలపై ఆరా తీశారు. 2017లో ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ ముమైత్‌ను విచారించింది. అంతేకాకుండా ఎఫ్‌ లాంజ్‌ క్లబ్‌లో జరిగిన ఈవెంట్లు, నగదు లావాదేవీలపై ముమైత్‌ను అధికారులు ప్రశ్నించారు.

కెల్విన్‌, జిషాన్‌లతో ముమైత్‌కు నేరుగా సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌లాంజ్‌ క్లబ్‌ జీఎంకి ముమైత్‌కు మధ్య జరిగి బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ ఆరాతీసింది. ఇక మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు ఆదేశించారు. ఇదిలా ఉంటే.. డ్రగ్స్‌ కేసులో ముమైత్‌ను నాలుగేళ్ల క్రితం ఎక్సైజ్‌ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెను పది గంటల పాటు విచారించారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ముమైత్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read: Sonu Sood: సోనూసూద్ నివాసంలో ఐటీ సోదాలు.. ఇల్లు, ఆఫీస్ సహా 6 చోట్ల తనిఖీలు

Xiaomi Smart Glasses: ఫేస్‌బుక్‌కు ధీటుగా రంగంలోకి దిగిన షావోమీ… సరికొత్త స్మార్ట్‌ గ్లాసెస్‌ రూపకల్పన.

Pawan Kalyan: చిన్నారి చైత్ర కుటుంబానికి జనసేనాని పవన్ పరామర్శ.. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా