- Telugu News Photo Gallery Technology photos Xiaomi Introduced New Smart Glasses wearable device concept Have Look On Features
Xiaomi Smart Glasses: ఫేస్‌బుక్‌కు ధీటుగా రంగంలోకి దిగిన షావోమీ… సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ రూపకల్పన.
Xiaomi Smart Glasses: చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ తాజాగా స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 'వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్' పేరుతో తయారు చేసిన ఈ గ్లాసెస్‌లో అద్భుత ఫీచర్లు ఉన్నాయి.
Updated on: Sep 15, 2021 | 5:20 PM

ప్రస్తుత రోజుల్లో అన్ని వస్తువులు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ కళ్ల జోళ్లు (గ్లాసెస్) కూడా వచ్చేశాయి. ఇప్పటికే ఫేస్‌బుక్ 'రే బాన్ స్టోరీస్' పేరుతో స్మార్ట్ గ్లాసెస్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక ఫేస్‌బుక్‌కు పోటీగా చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ కూడా 'వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్' పేరుతో స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది.

ఈ స్మార్ట్ కళ్ల జోడులో నోటిఫికేషన్లు సెండ్ చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం, నావిగేషన్, ఫొటోలు తీయడం, టెక్ట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవడం వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా బ్యాక్ లైటింగ్ కోసం 2.4ఎంఎంx2.02 ఎంఎం పరిమాణంలో మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఇక ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో షావోమీ వాయిస్ అసిస్టెంట్ షావోఏఐ ని వినియోగించుకోవచ్చు. ఫోటోలు తీసేందుకు 5 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ మైక్స్, స్పీకర్‌లు, బ్లూటూత్, వైఫై, టచ్‌ప్యాడ్‌ను కూడా అందించారు.

ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ గ్లాసెస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై మాత్రం షావోమీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.





























