- Telugu News Photo Gallery Technology photos Flipkart Big Billion Days Sale 2021 Launching Soon Have A Look On Offers For Various Gadgets
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ పండగ వచ్చేస్తోంది.. ఏ ప్రొడక్ట్స్ ధర ఎంత తగ్గనుందో తెలుసా.?
Flipkart Big Billion Days Sale: ఆకట్టుకునే ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలోనే వచ్చేస్తోంది. త్వరలోనే ప్రారంభంకానున్న ఈ సేల్‌లో భాగంగా పలు గ్యాడ్జెట్లపై అదిరిపోయే ఆఫర్లు అందించనున్నారు...
Updated on: Sep 15, 2021 | 3:29 PM

వినియోగదారులను ఆకర్షించే క్రమంలో ప్రతీ ఏటా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తోందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ బిగ్ సేల్ ఉండనున్నట్లు ఫ్లిప్ కార్ట్ అధికారికంగా తెలిపింది.

అయితే ఇంకా తేదీ ఎప్పుడనే విషయం ప్రకటించకపోయినప్పటికీ కొన్ని గ్యాడ్జెట్లపై ఏకంగా 70 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్‌లు అందించనున్నట్లు తెలుస్తోంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లతో పాటు పేటీఎమ్‌తో కొనుగోలు చేసే వారికి క్యాష్ బ్యాక్ కూడా అందిచనుంది.

ఈ సేల్‌లో ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 12తో పాటు లేటెస్ట్ మోడల్ 13ను కూడా తగ్గింపు ధరతో అందచేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సేల్‌లో రియల్ మీ 4కే గూగుల్ టీవీ స్టిక్ కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఇక ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ సౌండ్ కోర్ ఈయర్ ఫోన్స్, MSI GF63 Thin Core i5 గేమింగ్ ల్యాప్‌టాప్, బోల్ట్ ఆడియో సోల్ పోడ్స్ ఈయర్ ఫోన్స్, ఫైర్ బోల్ట్ మ్యాక్స్ స్మార్ట్‌వాచ్‌లను పరిచయం చేయనుంది. బోట్ స్మార్ట్ వాచ్‌పై 70 శాతం, బోట్ స్పీకర్లపై 80 శాతం డిస్కౌంట్ అందించనున్నారు.

వీటితో పాటు ఇంటెల్ ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిజో ఈయర్ ఫోన్స్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.





























