- Telugu News Photo Gallery Technology photos Xiaomi Launching New Smartphone MI Lite 5G NEW Features And Price Details
MI 11 Lite: గెట్ రడీ.. ఎమ్‌ఐ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది. ఎమ్‌ఐ 11 లైట్ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?
MI 11 Lite: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీ తాజాగా 11 లైట్ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. 11 లైట్ 5జీ ఎన్‌ఈ పేరుతో రానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు.
Updated on: Sep 14, 2021 | 3:47 PM

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి రోజుకో కొత్త ఫోన్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

ఎమ్‌ఐ 11 లైట్‌ను ఇప్పటికే విడుదల చేసిన ఎమ్‌ఐ.. తాజాగా 11 లైట్ సిరీస్‌లో భాగంగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

సెప్టెంబర్ 15న ఎమ్‌ఐ 11 లైట్ 5జీ ఎన్‌ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే షావోమీ తాజాగా ఈ ఫోన్ టీజర్‌ను ట్వీట్ చేసింది.

షావోమీ 11 లైట్ 5జీ ఎన్‌ఈ ధర సుమారు రూ. 28,600గా ఉండొచ్చని అండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..

ఇందులో 6.55 అంగుళాల హెచ్‌డీ+అమోల్డ్ హోల్‌పంచ్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. రియర్ కెమెరాలో మూడు కెమెరాలు ఉండడం విశేషం.

సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 33వాట్ రాపిడ్ ఛార్జింగ్, 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.





























