AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medicinal Plants: కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

Medicinal Plants-Amrutha Kada:  ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది.  ఇంకా చెప్పాలంటే.. మనిషి పంచభూతాలతో నిర్మితం.. అందుకనే ప్రకృతిమనిషికి జీవనాధారమైంది. మనకు  ఊపిరినిచ్చే..

Medicinal Plants: కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
Amruta Kada
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 16, 2021 | 11:22 AM

Share

Medicinal Plants-Amrutha Kada:  ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది.  ఇంకా చెప్పాలంటే.. మనిషి పంచభూతాలతో నిర్మితం.. అందుకనే ప్రకృతిమనిషికి జీవనాధారమైంది. మనకు  ఊపిరినిచ్చే గాలి, తినే ఆహారం, అన్ని మొక్కలనుంచే లభిస్తాయి. ఇక మనం ఎందుకు పనిరావని పిచ్చిమొక్కలుగా భావించి చూసే వాటిల్లో కూడా అనేక ఔషధగుణాలున్నాయని మన పురాతన వైద్య శాస్రం ఆయుర్వేదం తెలిపింది. ఈ రోజు చేలల్లో, పొలం గట్లమీద, ఇంటి చుట్టుపక్కన ఇలా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఓ మొక్కలోని ఔషధ గుణాలను గురించి తెలుసుకోబోతున్నాం. అంతేకాదు గడ్డిలో కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్కను పశువులకు ఎక్కువగా తింటాయి. ఇక ఈ మొక్కను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఈ మొక్కను అమృత కాడ, వెన్న వెదురు, అడవి నాభి లేదా ఎండ్రాకు అని పిలుస్తారు. ఇది కమలిసా జాతికి చెందింది. దీని శాస్త్రీయ నామం కమలిన బెంగాల్నేసి. ఇది ఆఫ్రికాకి చెందిన మొక్క. ఇది ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తూ ప్రతి చోటా దర్శనమిస్తుంది.

 ప్రయోజనాలు: 

గాయాలు, పుండ్లు తగ్గించడానికి: 

అమృత కాడ మొక్క పేరుకే కాదు నిజంగా కూడా అమృతంలోని గుణాలు దీనిలో ఉన్నాయని పెద్దలు అంటారు. ఈ మొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ మొక్క ఆకులు, వేర్లు గాయాలు, పుండ్లను తగ్గించడంతో సహాయపడతాయి.

చర్మ వ్యాధులకు:

చర్మరోగాలు, మొహంపై మొటిమలు, మచ్చలు తగ్గించడానికి మంచి అమృత కాడ మంచి ఔషధంగా పనిచేస్తుంది. వీటి ఆకులను మెత్తని పేస్ట్ లా చేసి ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్న చోట అప్లై చేస్తే గాయాలు త్వరగా తగ్గిపోతాయి. మొటిమలు నివారింపబడి.. ముఖం అందంగా మారుతుంది.

సీజనల్ వ్యాధ్యులకు 

ఈ అమృతకాడ మొక్క ఆకులు జ్వరానికి ఔషధంగా పనిచేస్తాయి. ఈ ఆకులు ఆరు తీసుకొని 150 గ్రాములు నీటిలో అర స్పూన్ జీలకర్ర, అరస్పూన్ మిరియాలు కలిపి ఈ ఆకులు కూడా వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని రోజుకు ఒకసారి కనుక తాగుతూ ఉంటే జ్వరం తగ్గిపోతుంది. శరీరంలో వేడిని తగ్గించి మేలు చేయడంలో సహాయం పడుతుంది.  మలేరియా జ్వరం తగ్గడానికి ఈ ఆకులను నలిపి ఆ రసాన్ని తాగుతారు. ఆకులను కూడా గొంతు నొప్పి ఉపశమనానికి ఉపయోగిస్తూ ఉంటారు.

కీళ్ల నొప్పుల నివారణకు: 

మొక్కలోని రసాయనాలను కీళ్ల నొప్పులపై అప్లై చేస్తే.. త్వరగా నొప్పులు తగ్గుతాయని పల్లెవాసుల నమ్మకం.  ఈ మొక్క ఆకులను పేస్ట్ చేసి నొప్పి ఉన్నచోట పూస్తే శరీరంలోని నొప్పులను తగ్గిస్తుంది.

*ఈ ఆకును పాము విషానికి విరుగుడుగా పల్లెల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.

*రుతుక్రమం రెగ్యులర్పీ గా రాని మహిళలకు అమృత కాడ నిజంగా అమృతంలా పనిచేస్తుంది. ఈ ఆకు మరియు కాండం యొక్క కషాయాన్ని తాగితే.. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి విముక్తిమాత్రమే కాదు..ఆ సమయంలో తలెత్తే ఇబ్బందులు కూడా నివారింపబడతాయి. రుతుక్రమంలో అధిక రక్తస్రావం తగ్గడానికి ఉపయోగిస్తారు. స్త్రీలలో సంతాన సమస్యలు తగ్గించడానికి కూడా ఈ మొక్కలు ఉపయోగిస్తారు.

* మూత్రంలో మంటకి ఈ ఆకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది.

*ఈ మొక్క వేర్లను జ్వరం, లివర్ వ్యాధి ఉపశమనానికి వాడతారు.

ఈ మొక్కను ఆకుకూరగా కూడా వండుకొని తింటుంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా అమృత కాడను ఆయుర్వేద, యునాని వైద్యంలో  వాడుతూ ఉంటారు.

Also Read: Humanity: ఆస్థి రాయించుకుని 90ఏళ్ల తల్లిని అనాథగా వదిలేసిన నలుగురు కూతుళ్లు.. కలెక్టర్‌ను ఆశ్రయించిన వృద్ధురాలు