AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mixed Vegetable Salad: బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ ఫుడ్.. మిక్సిడ్ వెజిటబుల్ సలాడ్.. తయారీ విధానం ఎలా అంటే

Mixed Vegetable Salad: ప్రస్తుత జనరేషన్ లో చిన్న పెద్ద అనే తేడాలేదు.. వయసుతో పనిలేదు.. ఎక్కువమంది ఊబకాయం, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా బరువు పెరగడంతో అనేక వ్యాధులకు గురవుతున్నారు..

Mixed Vegetable Salad: బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ ఫుడ్.. మిక్సిడ్ వెజిటబుల్ సలాడ్.. తయారీ విధానం ఎలా అంటే
Mixed Vegetable Salad
Surya Kala
|

Updated on: Sep 15, 2021 | 10:34 AM

Share

Mixed Vegetable Salad: ప్రస్తుత జనరేషన్ లో చిన్న పెద్ద అనే తేడాలేదు.. వయసుతో పనిలేదు.. ఎక్కువమంది ఊబకాయం, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా బరువు పెరగడంతో అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఇలా బరువు పెరగడానికి ముఖ్య కారణం.. రోజు రోజుకీ మారుతున్న అస్త‌వ్య‌స్త‌మైన‌ జీవనశైలి. సమయంలో తిని నిద్రపోనివారి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా శరీరం బరువు పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడానికి డైట్, వ్యాయామం , యోగా వంటివాటిని ఆశ్రయిస్తారు. అయితే వీటితో పాటు.. తినే ఆహారం మీద శ్రద్ధ వహిస్తే ఎవరైనా సరే బరువు ఈజీగా తగ్గుతారు.  ఈరోజు బరువుని తగ్గించే అద్భుతమైన ఆహారం మిక్సిడ్ కూరగాయల సలాడ్ తయారు గురించి తెలుసుకుందాం..

మిక్సిడ్ వెజిటబుల్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు: 

ఆలివ్ ఆయిల్- టీస్పూన్ (లేదా వెన్న)

బేబీ కార్న్‌ -3

బ్రోకలీ-1

టమోటాలు-2

గ్రీన్ క్యాప్సికమ్-1

పసుపు క్యాప్సికమ్-

క్యారెట్లు-2

ఆకుపచ్చ బీన్స్ -10

తయారీవిధానం: 

మొదట కూరగాయలను కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరవాత స్టౌ మీద గిన్నెపెట్టి.. కొంచెం నీరుపోసుకుని నీటిని వేడి చేయాలి… తర్వాత ఆ వేడి నీటిలో బ్రకోలీ వేసి.. కొంత సమయం ఉంచి..  మృదువుగా మారిన తర్వాత బ్రకోలిని వేడి నీటి నుంచి తీసుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి.. ఆలివ్ ఆయిల్ ను వేసుకోవాలి. ఇష్టం ఉన్నవారు నూనెకు బదులు వెన్నను ఉపయోగించవచ్చు. నూనె వేడి అయ్యాక బేబీ కార్న్, తరిగిన కూరగాయల ముక్క‌ల‌ను వేసుకోవాలి. కొంచెం సేపు వేయించిన తర్వాత కొంచెం నీరు వేసి సలాడ్ ను తక్కువ మంట మీద  ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. రుచికి సరిపడే ఉప్పు వేసుకుని.. తర్వాత కొంచెం నల్ల మిరియాల పొడి జల్లుకుంటే హెల్తీ టేస్టీ సలాడ్ రెడీ ..

ఆరోగ్య ప్రయోజనాలు: 

ఈ సలాడ్ హెల్తీ ఫుడ్.. పొట్ట నిండుగా ఉంటుంది. దీంతో అపానవాయువు, ఉబ్బరం సమస్యలు ఉండ‌వు. మలబద్ధకం తగ్గుతుంది. శక్తిని ఇస్తుంది. అధిక బరువు తగ్గుతారు.  ఈ సలాడ్ ను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌ గా ఉంచుతుంది. ప్రతి రోజూ ఈ సలాడ్ ను తింటే జీర్ణక్రియ మెరుగు ప‌డుతుంది. కొంతమందికి కూర‌గాయ‌ల‌ను పచ్చిగా తినడం న‌చ్చ‌దు. అటువంటివారు వారు ఈ స‌లాడ్‌ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం.

Also Read: కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే..