Gaddi Chamanthi: మానని గాయాలు, తీవ్రమైన జుట్టు సమస్యలను పైసా ఖర్చు లేకుండా తీర్చే గడ్డి చామంతి.. ఆరోగ్య ప్రయోజనాలు

Gaddi Chamanthi: చిన్నతనంలో పలకలను శుభ్రం చేయడానికి ఉపయోగించడంతో పలకాకుగా అందరికీ పరిచయమైన గడ్డి చామంతి మొక్క.. ఎక్కడ బడితే అక్కడ విరివిగా కనిపించే ఈ కలుపుజాతి గడ్డి చేమంతి మొక్కలో..

Gaddi Chamanthi: మానని గాయాలు, తీవ్రమైన జుట్టు సమస్యలను పైసా ఖర్చు లేకుండా తీర్చే గడ్డి చామంతి.. ఆరోగ్య ప్రయోజనాలు
Gaddi Chamanthi
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2021 | 11:38 AM

Gaddi Chamanthi: చిన్నతనంలో పలకలను శుభ్రం చేయడానికి ఉపయోగించడంతో పలకాకుగా అందరికీ పరిచయమైన గడ్డి చామంతి మొక్క.. ఎక్కడ బడితే అక్కడ విరివిగా కనిపించే ఈ కలుపుజాతి గడ్డి చేమంతి మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయట. ఈ మొక్కల పువ్వులతో ముందు జనరేషన్ వరకూ ఆడుకునేవాడు. సన్నపాటి రేకులతో పసుపు పచ్చని పూలతో అందంగా కనిపిస్తుంది. ఈ మొక్కలో అనేక ఆయుర్వేద గుణాలున్నాయట. ముఖ్యంగా ఆయుర్వేదంతో మనిషి వాత, పిత్త, కఫ సంబంధ రుగ్మతలతో రోగాల బారిన పడతారని విశ్లేషణ. వీటన్నికి మంచి చికిత్స మన ఆయుర్వేదం.. ఒకప్పుడు ప్రాచీన వైద్యం.  ఈ ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఉపయోగించే మొక్క గడ్డి చామంతి. దెబ్బ తగిలిన చోట ఏర్పడిన గాయానికి గడ్డి చామంతి ఆకుల రసాన్ని అప్లై చేస్తే .. అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అంతేకాదు గడ్దిచామంతి అనేక రకాల చర్మ వ్యాధులకు ఈ ఆకు రసం..  ఇప్పటికీ మన దేశంలో అనేక ప్రదేశాల్లో వాడుతూనే ఉన్నాయి. కొన్ని పల్లెటూర్లలోని రైతులు గడ్డి చామంతిని పశువుల గాయాలు, పుండ్లకు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా ఉపయోగించవచ్చని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

సాంప్రదాయకంగా గడ్డి చామంతిని శరీరంపై ఏర్పడిన గాయాలను నయం చేయడానికి అనేక రకాల ఉపశమనానికి చికిత్సలో ఉపయోగిస్తున్నారు.  ఈ మొక్కలో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి.

చర్మ అంటు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారికి దీని ఆకు రసం మంచి ఔషధం.  ఇప్పటికీ మనదేశంలోని అనేక గ్రామాల్లో దిమ్మలు, తామర, గజ్జి, బొబ్బలు , గాయాలకు ఈ గడ్డి చామంతిని చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్నారు.

గడ్డి చామంతిలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలను నివారిస్తుంది.

గాయం తగిలిన చోట ఈ ఆకు రసాన్ని పిండి కట్టుకడితే నొప్పులు తగ్గిపోతాయి.

ట్రైడాక్స్ ప్రొక్యూంబెన్స్ అనేది జుట్టు పెరుగుదలకు సాంప్రదాయకంగా ఉపయోగించే ఆయుర్వేద ఔషధం.. ఇది భృంగరాజ్ స్థానంలో ఉపయోగించబడుతుంది. రాలిన జుట్టు పెరుగుదలకు గడ్డి చామంతి మంచి సహాయకారి.

ఈ మొక్క  కాలేయ రుగ్మతలు, హెపాటోప్రొటెక్షన్, పొట్టలో పుండ్లు,  గుండెల్లో మంట కోసం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.

షుగర్ వ్యాధికి ఈ గడ్డి చామంతి మొక్క చాలా బాగా పనిచేస్తుందని ఈ మధ్యనే పరిశోధనలో తేలింది. గడ్డిచామంతి ఆకులలో ఉండే జేర్యలోనిక్ అనే రసాయనం వలన ఇది షుగర్ వ్యాధికి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఈ రసాయనం బాగా ఉపయోగపడుతుంది.
నీటిలో ఉండే ఫ్లోరైడ్ శక్తి వలన ఎన్నో రకాల జబ్బుల బారిన పడుతున్నారు. అలాంటి ఫ్లోరైడ్ శక్తిని తగ్గించే గుణం ఈ గడ్డి చామంతి ఆకులకు ఉందని ఈమధ్యే పరిశోధనల్లో తేలింది.
గడ్డి చామంతి మొక్క ఆకులకి తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఉంది.

వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు దోమల వలన వస్తూ ఉంటాయి. ఈ మొక్క క్రిమి వికర్షకంగా పనిచేస్తుంది. దీనిని ఇంటి మధ్యలో ఉంచి లైట్లు ఆపి తలుపుల మూసేస్తే దీని వాసన వలన దోమలు చనిపోతాయి. మిగిలినవి బయటకు వెళ్లిపోతాయి.  అంతేకాదు ఈ ఎండిన ఆకులను పొగ వేస్తే క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు వంటివి ఇంట్లోకి రావు.

గడ్డిచామంతిలోని ఔషధ విలువలు గురించి అవగాహన లేక కలుపు మొక్క గావించి పీకేస్తుంటారు. ఈ మొక్క అనేక రకాల ఔషధ గుణాలను తనలో దాచుకుంది. ఈ మొక్కకు సాంప్రదాయ ఆయుర్వేద ఔషధంలో ప్రత్యేక స్థానం ఉంది. వీటి ఆకులను ఆకుకూరగా కూడా తింటుంటారు. వీటిని పలక ఆకులు, గడ్డిచామంతి, గాజు తీగ, నల్ల ఆలం వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు.

Also Read: Mixed Vegetable Salad: బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ ఫుడ్.. మిక్సిడ్ వెజిటబుల్ సలాడ్.. తయారీ విధానం ఎలా అంటే