Heart Donation: తాను మరణిస్తూ మరొకరి గుండెచప్పుడుగా మారనున్న కానిస్టేబుల్.. మలక్‌పేట్ యశోద నుంచి నిమ్స్‌కు తరలించనున్న గుండె

Constable-Heart Donation: పుట్టిన మనిషి మరణించక తప్పదు.. అయితే కొందరు మరణించీ చిరంజీవులు. మంచితనం మానవత్వంతో వారు చేసిన పనులతో మరణం వారి శరీరానికి మాత్రమే అనిపిస్తుంది. కుటుంబ..

Heart Donation: తాను మరణిస్తూ మరొకరి గుండెచప్పుడుగా మారనున్న కానిస్టేబుల్.. మలక్‌పేట్ యశోద నుంచి నిమ్స్‌కు తరలించనున్న గుండె
Constable Veerababu
Follow us
Surya Kala

|

Updated on: Sep 15, 2021 | 1:05 PM

Constable-Heart Donation: పుట్టిన మనిషి మరణించక తప్పదు.. అయితే కొందరు మరణించీ చిరంజీవులు. మంచితనం మానవత్వంతో వారు చేసిన పనులతో మరణం వారి శరీరానికి మాత్రమే అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల్లోనే కాదు.. వారు ఎవరో అప్పటివరకూ తెలియకపోయినా అందరి మనసుల్లోనూ వారు ఎప్పుడూ ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోతారు. అయితే  తమ కుటుంబంలో అప్పటి వరకూ ఉన్న ఒక సభ్యులు అనుకోకుండా ప్రమాదం బారిన పడి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం.. ఆలా  విధులను నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ప్రమాదానికి  గురై.. మృత్యు ముఖంలోకి చేరుకున్నాడు. రోడ్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ గా మారదు.  అనుకోకుండా జరిగిన ప్రమాదంతో 34 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. కన్నవారికి, అయినవారికి  తీరని శోకాన్ని మిగులుస్తూ తిరిగిలోకానికి వెళ్ళిపోయాడు. అయితే తాను వెళ్తూ.. మరోకరి గుండె చప్పుడుగా మారాడు. మరో వ్యక్తిని ఆయుస్సు పోశాడు. అవయవదాతగా నిలిచాడు కానిస్టేబుల్ వీరబాబు.

వీరబాబు అనే 34 ఏళ్ల వ్యక్తి కానిస్టేబుల్ గా హైదరాబాద్ లోని కొండాపూర్ లో 8th బెటాలియన్ లో  విధులను నిర్వహిస్తున్నాడు. పనిమీద ఖమ్మం వెళ్లిన వీరిబాబుకు అక్కడ జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. యాక్సిడెంట్ లో గాయపడిన వీరబాబుకి మలక్ పేట్ యశోద లో చికిత్సనందిస్తున్నారు. అయితే వీరబాబు బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వీరబాబు కుటుంబ సభ్యులు గుండెను దానం ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో వైద్యులు వీరబాబు గుండెను నిమ్స్ ఆసుపత్రి లో ఉన్న పేషెంట్ కి అమర్చిడానికి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం  2.30 నిమిషాలకు మలక్ పేట్ యశోద నుండి నిమ్స్ కి గుండె తరలించనున్నారు.

మా తమ్ముడు మరొకరి  రూపంలో బతికే ఉంటాడు: 

ఇదే విషయంపై గుండె దాత కానిస్టేబుల్ వీరబాబు అన్నయ్య నాగేశ్వర్ రావ్  టీవీ 9 తో  మాట్లాడుతూ.. తన తమ్ముడు చిన్నప్పటి నుంచి ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే ఉండేవాడని చెప్పారు.  ఖమ్మం లో బస్ ఆక్సిడెంట్ లో మా తమ్ముడు వీరబాబు తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో  జీవన్ దాన్ వాళ్ళు గుండె మార్పడి కి సంబంధించి మమ్మలిని సంప్రదించారు. మేము మా తమ్ముడు మా నుంచి దూరం అయిన ప్రాణాలతో ఇంకొకరి రూపం లో బతికే  ఉంటాడని.. గుండెను దానంగా ఇవ్వడానికి అంగీకరించినట్లు చెప్పారు.

రూట్ మ్యాప్ పై మలక్ పేట్ ట్రాఫిక్ సిఐ

మలక్ పేట్ నుంచి గుండెను నిమ్స్ కు తరలించడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.  మలక్ పేట్ ట్రాఫిక్ సిఐ జోత్స్న మార్పడి రూట్ మ్యాప్ ని టీవీ 9 తో పంచుకున్నారు. ఒంటిగంట ప్రాంతం లో అంబులెన్స్ స్టార్ట్ అవుతుందని.. మలక్ పేట్ నుండి నిమ్స్ వరకు ఉన్న అన్ని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల సమన్వయం తో ముమెంట్ ఉంటుందని చెప్పారు.  ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని జ్యోత్స చెప్పారు.

Also Read:  రామ్‌చరితమానస్‌ను పాఠ్యంశంగా ప్రవేశ పెట్టిన రాష్ట్రం.. ఎన్నికల కోసం చౌకబారు ప్రయత్నాలంటున్న కాంగ్రెస్ నేతలు