Ramcharitmanas: రామ్‌చరితమానస్‌ను పాఠ్యంశంగా ప్రవేశ పెట్టిన రాష్ట్రం.. ఎన్నికల కోసం చౌకబారు ప్రయత్నాలంటున్న కాంగ్రెస్ నేతలు

Ramcharitmanas:మన సంస్కృతి సంప్రాదయాలను విదేశీయులు పాటిస్తున్నారు. మనం మరచిపోతున్న వేదాలనువల్లివేస్తున్నారు. సంస్కృత భాషలో పాఠ్యంశాలను బోధిస్తున్నారు. కొని దేశాల్లో మన వీరులు చేసిన యుద్ధాలను..

Ramcharitmanas: రామ్‌చరితమానస్‌ను పాఠ్యంశంగా ప్రవేశ పెట్టిన రాష్ట్రం.. ఎన్నికల కోసం చౌకబారు ప్రయత్నాలంటున్న కాంగ్రెస్ నేతలు
Ram Charit Manas
Follow us

|

Updated on: Sep 15, 2021 | 12:20 PM

Ramcharitmanas:మన సంస్కృతి సంప్రాదయాలను విదేశీయులు పాటిస్తున్నారు. మనం మరచిపోతున్న వేదాలనువల్లివేస్తున్నారు. సంస్కృత భాషలో పాఠ్యంశాలను బోధిస్తున్నారు. కొని దేశాల్లో మన వీరులు చేసిన యుద్ధాలను పిల్లతో చదివిస్తున్నారు. మరికొన్ని దేశాలు మన యుద్ధ వీరులను  స్ఫూర్తిగా తీసుకుని పోరాటాలు చేశారు.  మనం తక్కువగా నిర్లక్ష్యంతో చూసే  ఆయుర్వేదం, హోమియోపతి, యోగవంటి ఎన్నింటినో ఓన్ చేసుకున్నారు. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఒక స్లోగన్ హల్ చల్ చేస్తోంది. వాటిల్లో ఒకటి.. కోర్టు మెట్లు ఎక్కినవారిని బోనులో భగవద్గీత మీద ప్రమాణం చేయించే బదులు.. ఆ భగవద్గీతని చిన్నతనం నుంచి పిలల్లకు పాఠశాల్లో భోదిస్తే.. మంచిది కదా అని వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే..

అయితే తాజాగా హిందూ ధర్మంలో ఒక గొప్ప పుస్తకం రామ్ చరిత్ మానస్ .. మానవుడి.. తన నడవడికతో. మాటతో పనులతో దేవుడిగా పూజింపబడుతున్న శ్రీరాముడి గురించి పాఠ్యంశంగా బోధించనున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇక నుంచి శ్రీరాముడి గురించి బోధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిలాసఫీలో బోధించడానికి   ఉన్నత విద్య విభాగం ‘రామ్‌చరిత్‌మానస్‌ ప్రాక్టికల్ దర్శన్’  అనే సిలబస్‌ను సిద్ధం చేసింది. ఇందులో 100 మార్కుల పరీక్ష ఉంటుంది.  అయితే ఇది కంపల్సరీ కాదు.. ఎవరికీ ఇష్టమైతే వారు ఈ సబ్జెక్ట్ ను ఎంచుకొనే .వీలుకల్పించింది. ఈ సబ్జెక్ట్‌ను హిందీ లేదా ఫిలాసఫీ ప్రొఫెసర్లు బోధిస్తారు. దీనిని ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు బోధించడానికి సర్వం సిద్ధం చేసింది అక్కడి సర్కార్. ఆ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి మోహన్‌ యాదవ్‌ ఈ విషయంపై స్పందిస్తూ..  “జీవిత విలువలు” , “వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం”వంటి అనేకే అంశాలను విద్యార్థులకు బోధించడానికి ఈ సబ్జెక్టులు  పాఠ్యంశాలుగా చేర్చబడ్డాయని చెప్పారు. రామ్‌చరితమానస్ లో  సైన్స్, సంస్కృతి, సాహిత్యంతోపాటు శృంగారాన్ని కూడా కలిగి ఉందన్నారు. ఇది ఏ మతానికి చెందింది కాదని.. ఉర్దూ గజల్‌ని కూడా ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టామని చెప్పారు.

అయితే ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు  చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తమ చేసిన తప్పులను కప్పి పుచ్చుకుని రానున్న ఎన్నికల్లో లబ్ది పొందడానికే చూస్తుందని విమర్శించారు.  బీజేపీ నేతలు చేస్తున్న  చౌకబారు ప్రయత్నాలంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆరిఫ్‌ మసూద్‌  ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:   మానని గాయాలు, తీవ్రమైన జుట్టు సమస్యలను పైసా ఖర్చు లేకుండా తీర్చే గడ్డి చామంతి.. ఆరోగ్య ప్రయోజనాలు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు