Health Tips: నోటి దుర్వాసన వేధిస్తుందా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..
Bad Breath: జీవనశైలిలో మార్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటి ప్రధాన సమస్యల్లో నోటి దుర్వాస ఒకటి. వైద్యపరంగా నోటి దుర్వాసనను
Bad Breath: జీవనశైలిలో మార్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటి ప్రధాన సమస్యల్లో నోటి దుర్వాస ఒకటి. వైద్యపరంగా నోటి దుర్వాసనను హాలిటోసిస్ అని పిలుస్తారు. అయితే.. శరీరంలో నోరు, దంతాలు, చిగుళ్లు, గొంతు సమస్యలు, జీర్ణవ్యవస్థ సరిగా జరగకపోవడం ఇతర ఆరోగ్య సమస్యల వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. మనం తినే ఆహారం శరీరంలోకి వెళ్లిన తర్వాత సరిగా జీర్ణం కాకపోతే.. ఊపిరితిత్తుల ద్వారా దుర్వాసన మనం పీల్చుకునే గాలిని ప్రభావితం చేస్తుంది. అయితే.. ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో ఘాటైన వాసన కలిగిన పదార్థాలు (వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు వంటివి) తింటే దుర్వాసన వస్తుంది. సాధారణ దుర్వాసనను బ్రషింగ్, మౌత్ వాష్ ద్వారా తాత్కాలికంగా నియంత్రించవచ్చు. కానీ.. ఘాటైన ఆహారాలు తింటే.. వాసన పూర్తిగా పోదు. అయితే.. నోటి దుర్వాసన కలిగించే సాధారణ ఆహారాలలో జున్ను, పాస్ట్రామి, కొన్ని సుగంధ ద్రవ్యాలు (మసాలా దినుసులు), నారింజ రసం, సోడా, ఆల్కహాల్ ఉన్నాయి.
నోటి దుర్వాసనకు కారణాలు.. నోరు తడారిపోవడం: నోటి దుర్వాసనకు ప్రధాన కారణం నోటిలో తడిలేకపోవడం. ఎప్పటికప్పుడు నోరు ఆరిపోకుండా నీరు తాగుతుండాలి. ఇలా చేస్తే లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా వెళ్లి తాజా శ్వాస బయటకు వస్తుంది. జీర్ణ సమస్యలు: జీర్ణ సమస్యలు కూడా నోటి దుర్వాసకు కారణమవుతాయి. ప్రేగు రుగ్మతలు, మలబద్ధకం, జీర్ణ సమస్యల సల్ఫర్ వాయువులు మీ నోటి నోటి దుర్వాసనకు కారణమవుతాయి. ధూమపానం: సిగరెట్లలో అనేక టాక్సిన్స్ రసాయనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించడంతోపాటు నోటి దుర్వాసనకు కారణమవుతాయి. నోటి పరిశుభ్రత లేకపోవడం: సాధారణంగా నోటిలో బ్యాక్టీరియా ఉంటుంది. సల్ఫర్ సమ్మేళనాలతో కూడిన బ్యాక్టిరియా నోటి దుర్వాసనకు మూలంగా మారుతుంది. కాఫీ, మద్యం తాగడం: ఈ రెండు పానీయాలు రుచిని కలిగిఉంటాయి. మద్యం, కాఫీ తాగినప్పటి నుంచి ఆ వాసన నోటిలో చాలా గంటలపాటు ఉంటుంది. కాఫీ, ఆల్కహాల్ రెండూ లాలాజల ఉత్పత్తిని తగ్గించి నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
నోటి దుర్వాసన తగ్గించేందుకు ఇలా చేయండి.. ➼ వాము, తులసి, పుదీనా వంటివి ఆహారంలో తీసుకోవాలి. లేకపోతే విడిగా వాటిని తిన్నా దుర్వాసన నుంచి గట్టెక్కవచ్చు. ➼ నోటి దుర్వాసన పోగొట్టుకునేందుకు యాంటీఆక్సిడెంట్ ఉన్న పోషకాలు తృణధాన్యాలు, పండ్లు, క్యారెట్లు, పుచ్చకాయలు, సిట్రస్ ఆహారాలు తినాలి. ➼ త్వరగా ఆహారం జీర్ణమయ్యే ఫైబర్ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ➼ దీంతోపాటు ఆహారం తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ➼ నోటి దుర్వాసన కళ్లేం వేసేందుకు.. వాము, జీలకర్ర, తులసి, పుదీనా ఆకులను తినాలి. దీంతో నోటి దుర్వాసన నుంచి గట్టెక్కడమే కాకుండా జీర్ణక్రియ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. ➼ నీరు ఎక్కువగా తాగుతుండాలి. దీనివల్ల బ్యాక్టిరియా కూడా వృద్ధి చెందదు.
Also Read: