Power Nap: పగటిపూట నిద్రించడం వల్ల ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి..! మీకు తెలుసా..?

Power Nap: మారుతున్న జీవనశైలిలో భాగంగా 51% కంటే ఎక్కువ మంది సరైన నిద్ర పోవడం లేదు. ముఖ్యంగా పెద్దలు పగటిపూట అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు.

Power Nap: పగటిపూట నిద్రించడం వల్ల ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి..! మీకు తెలుసా..?
Power Nap
Follow us

|

Updated on: Sep 14, 2021 | 8:34 PM

Power Nap: మారుతున్న జీవనశైలిలో భాగంగా 51% కంటే ఎక్కువ మంది సరైన నిద్ర పోవడం లేదు. ముఖ్యంగా పెద్దలు పగటిపూట అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. అందుకే వారు మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటే రిఫ్రెష్‌ అవుతారు. ఒక గంట లేదా అంతకంటే తక్కువసేపు నిద్రపోవడాన్ని “పవర్ ఎన్ఎపి” అని పిలుస్తారు. అయితే పగటిపూట నిద్రించడం వల్ల కలిగే 5 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. పగలు, రాత్రి పని చేసే వ్యక్తులకు మధ్యాహ్న నిద్ర మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒక గంటసేపు నిద్రిస్తే వాళ్లు మళ్లీ ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారు. ఒత్తిడికి గురైనప్పుడు లేదా సమస్యకు పరిష్కారం కనుగొనలేనప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని అధ్యయనాలలో తేలింది.

2. సైటోకిన్స్ నిద్రలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్. దీనివల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. మధ్యాహ్న నిద్ర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. అందుకే అనారోగ్యానికి గురైనప్పుడు నిద్ర చాలా అవసరం. అప్పుడే మనిషి తొందరగా కోలుకుంటాడు.

3. పగటి నిద్ర జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మీ మెదడును అలర్ట్ చేస్తుంది. కొంతమంది విద్యార్థులు చదువుకుంటూనే నిద్రలోకి జారుకుంటారు. మేల్కొన్న తర్వాత చాలా యాక్టివ్‌గా ఉంటారు.

4. పగటినిద్ర వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దానికి మంచి ఉపశమనం దొరుకుతుంది. అందువల్ల గుండెపోటు, స్ట్రోక్‌ల నుంచి మీ హృదయాన్ని సురక్షితంగా రక్షించుకోవచ్చు.

5. మధ్యాహ్న నిద్ర ఒక గంటలోపే ఉండాలి. లేదంటే ఊబకాయం, బద్దకం పెరుగుతాయి. అంతేకాదు హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నిద్ర అనేది ఎల్లప్పుడు నియంత్రణలో ఉండాలి.

Viral Video: అమ్మ బాబోయ్‌.. ఇదేం క్రియేటివిటీరా బాబు. బైక్‌ను కారుగా మార్చిన తీరు చూస్తే..

EPFO: ఇప్పుడు మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి నాన్ రిఫండబుల్ లోన్ తీసుకోవచ్చు.. ఎలానో తెలుసా?

Viral Video: కోనసీమ జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేప.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్