AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: రామ భక్తులకోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. రామాయణ ఆధారిత తీర్థయాత్ర.. ఎంత ఖర్చు అవుతుందంటే..

ఇప్పుడు భక్తులు IRCTC శ్రీ రామాయణ యాత్రతో శ్రీరాముని జీవితానికి సంబంధించిన అనేక ప్రముఖ పవిత్ర స్థలాలను దర్శించి రావచ్చు.

IRCTC: రామ భక్తులకోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. రామాయణ ఆధారిత తీర్థయాత్ర.. ఎంత ఖర్చు అవుతుందంటే..
Irctc
KVD Varma
|

Updated on: Sep 14, 2021 | 7:38 PM

Share

IRCTC: ఇప్పుడు భక్తులు IRCTC శ్రీ రామాయణ యాత్రతో శ్రీరాముని జీవితానికి సంబంధించిన అనేక ప్రముఖ పవిత్ర స్థలాలను దర్శించి రావచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ దేఖో అప్నా దేశ్ డీలక్స్ ఎయిర్ కండిషన్డ్ టూరిస్ట్ రైలు ద్వారా రామాయణ సర్క్యూట్‌లో శ్రీ రామాయణ యాత్ర థీమ్ ఆధారిత తీర్థయాత్ర పర్యటనను అందిస్తోంది. 16 రాత్రులు / 17 రోజుల పర్యటన ప్యాకేజీ ఢిల్లీ, జనక్‌పూర్, సీతామర్హి, అయోధ్య, ప్రయాగ్, వారణాసి, చిత్రకూట్, హంపి, నాసిక్ అదేవిధంగా రామేశ్వరం కవర్ చేస్తుంది. ఈ రైలు 7 నవంబర్ 2021 న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అతిథులకు, కోవిడ్ -19 టీకా పూర్తి మోతాదు తప్పనిసరి.

ఛార్జీలు ఇలా..

IRCTC యొక్క అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, 1AC క్లాస్ ప్రయాణం సింగిల్ ఆక్యుపెన్సీకి రూ .1,12,955, జంట, ట్రిపుల్ షేరింగ్ ఆక్యుపెన్సీకి రూ. 1,02,095, మంచం ఉన్న పిల్లలకు రూ .93,335 అలాగే, మంచం అవసరంలేని పిల్లలకు రూ. 91,440 ఛార్జీలు ఉంటాయి. ఇక 2AC తరగతి ప్రయాణం సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 93810, జంట, ట్రిపుల్ షేరింగ్ ఆక్యుపెన్సీకి రూ. 82950, ​​మంచం ఉన్న పిల్లలకు రూ .74185 అదేవిధంగా, మంచం అవసరంలేని పిల్లల కోసం రూ. 72040 ఛార్జ్ చేస్తారు. ప్యాకేజీలో ఇవి ఉంటాయి..

టూర్ ప్యాకేజీలో ఫస్ట్/సెకండ్ ఏసీ క్లాస్‌లో ప్రత్యేక టూరిస్ట్ రైలు ప్రయాణం, ఎనిమిది రాత్రులు డీలక్స్ కేటగిరీలో అందుబాటులో ఉండే వసతి, రాత్రిపూట ప్రయాణంలో సంబంధిత రైలు కోచ్‌లలో ఎనిమిది రాత్రులు, వెజిటేరియన్ ఆన్‌బోర్డ్ రైలు భోజనం, హోటళ్లలో వెజిటేరియన్ ఆఫ్ బోర్డ్ మీల్స్, అలాగే ఎయిర్ కండిషన్డ్ వాహనాలలో సందర్శించడం, ప్రయాణీకులకు ప్రయాణ బీమా, రైలులో భద్రత, IRCTC టూర్ మేనేజర్‌లు మొదలైనవి ఈ ప్యాకేజీలో కలిసి ఉన్నాయి.

శ్రీ రామాయణ యాత్ర టూర్ ప్యాకేజీ ఒకసారి బుక్ చేసుకున్న తరువాత ఏ కారణం చేతనైనా రద్దు చేసుకోవాల్సి వస్తే.. ప్రయాణానికి 15 రోజుల ముందు టిక్కెట్లను రద్దు చేస్తే ప్రతి ప్రయాణికుడికి రూ .250 తగ్గిస్తారు, 8-14 రోజుల వరకు రద్దు చేస్తే మొత్తం ఖర్చులో 25% తగ్గించి ఇస్తారు. ఖర్చులో 50% 4-7 రోజుల మధ్యలో చేస్తే తగ్గిస్తారు. టూర్ ప్యాకేజీ టిక్కెట్లను నాలుగు రోజుల్లోపు రద్దు చేస్తే IRCTC మొత్తం ఖర్చులో 100% తగ్గిస్తుంది అంటే ఏమాత్రం సొమ్ము వెనక్కి రాదు.

ఇవి కూడా చదవండి: Fact Check: అంతరిక్షంలో తిరుగుతున్న మిస్టరీ శాటిలైట్‌.. నాసా చెప్పిందేమిటంటే..!

Girlfriend: తాగుబోతులకు, తిరుగుబోతులకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. నాకూ కావలి..వెదికి పెట్టమని ఎమ్మెల్యేకు ఓ యువకుడు లెటర్..