Fact Check: అంతరిక్షంలో తిరుగుతున్న మిస్టరీ శాటిలైట్‌.. నాసా చెప్పిందేమిటంటే..!

Fact Check: గ్రహాంతర జీవనం అనేది మనిషికి ఎప్పటికి ఓ ఆసక్తికరమైన అంశమనే చెప్పాలి. ముఖ్యంగా గ్రహాంతర జీవుల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం..

Fact Check: అంతరిక్షంలో తిరుగుతున్న మిస్టరీ శాటిలైట్‌.. నాసా చెప్పిందేమిటంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 12, 2021 | 1:53 PM

Fact Check: గ్రహాంతర జీవనం అనేది మనిషికి ఎప్పటికి ఓ ఆసక్తికరమైన అంశమనే చెప్పాలి. ముఖ్యంగా గ్రహాంతర జీవుల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం అందరిలో ఉంటుంది. అందుకోసం బిలియన్ల డాలర్లు వెచ్చించే చేసే పరిశోధనలు ఆ ఆసక్తి ఏపాటిదో చెప్పకనే చెబుతున్నాయి. అయితే ఇన్నేళ్లలో ఏలియన్‌ గురించి ఎలాంటి క్లారిటీ రాలేకపోయారు. అయినప్పటికీ రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా సెప్టెంబర్‌ 2వ తేదీన అంతరిక్షంలో ఓ నల్లని ఆకారంలో ఓ వస్తువు కనిపించింది. ఇది అన్‌ఐడెంటిఫైడ్‌ అండ్‌ మిస్టీరియస్‌ శాటిలైట్‌ అంటూ ఓ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ప్రచారం మొదలైంది. దీనికి శాస్త్రవేత్తలు ‘బ్లాక్‌ నైట్‌​శాటిలైట్‌’ అని పేరు పెట్టారు. ఇంకో విశేషం ఏంటంటే.. 1930 నుంచి ఈ శాటిలైట్‌ నుంచి వింత రేడియో సిగ్నల్స్‌ వెలువడుతున్నాయి. అలా ఇది గ్రహాంతరవాసులకు చెందిన శాటిలైట్‌గా ప్రచారం మొదలుపెట్టారు. నాసా, సొవియట్‌ యూనియన్‌లు స్పేస్‌లోకి ఉపగ్రహాలు పంపక ముందు నుంచే ఇది పని చేస్తుందట. ఈ మిస్టరీ శాటిలైట్‌ గత పది రోజుల్లో విపరీతంగా షేర్‌ అయ్యింది.

అయితే ఇది శాటిలైట్‌ కాదని నాసా తేల్చి చెప్పింది. 1998లో స్పేస్‌ షెట్టల్‌ మిషన్‌లో భాగంగా.. ఇదొక శకలంగా గుర్తించారు. డిసెంబర్‌ 11, 1998న దీనిని ఫొటో తీశారు కూడా. ఇలాంటి శకలాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాసా స్పష్టం చేసింది. ఒక్కోసారి రాకెట్ల నుంచి వదిలే శకలాలు కూడా ఇలా భూ కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయని, లేదంటే విశ్వంలో విస్పోటనాల వల్ల కూడా శకలాలు విడుదల కావచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా భూ కక్ష్యలో ఇలాంటి ముక్కలు పాతిక వేల దాకా ఉన్నట్లు నాసా వెల్లడిస్తోంది. అందుకే భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్‌ అనేది ఉత్త ప్రచారమే అని నాసా తేల్చి చెప్పింది.

ఇవీ కూడా చదవండి: NASA: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమ్ముకున్న పొగలు.. అలారమ్‌ మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది

Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం