iPhone 13 Effect: ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 12 ధరలు.. ఎంతో తెలుసా?
iPhone 12: ఐఫోన్ 13 సిరీస్ విడుదలకు ముందు ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్ కార్డులో భారీ తగ్గింపు ప్రకటించింది.
iPhone 13: ఆపిల్ తన తర్వాతి తరం స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్ 14 న నిర్వహించే వార్షిక ఈవెంట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఐఫోన్ 13 సిరీస్ శక్తివంతమైన ప్రాసెసర్, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో విపణిలోకి రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాత సిరీస్‌లో ఐఫోన్‌లపై ఫ్లిప్‌కార్డు భారీ తగ్గింపులు అందిస్తోంది. అందుకే ఐఫోన్ కొనాలనుకునేవారకి ఇది చాలా మంచి సమయం. ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్ 12 ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ 12 మినీ 64జీబీ, 128జీబీ వెర్షన్‌లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో వరుసగా రూ. 59,999, రూ. 64,999 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్ల అసలు ధరలు వరుసగా రూ. 69,900, రూ. 74,900లు ఉండేవి. 256జీబీ వేరియంట్ రూ. 74.999లకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 84.900గా ఉండేది.
64జీబీ స్టోరేజ్ ఐఫోన్ 12 అసలు ధర రూ. 79,900లు గా ఉండగా, ప్రస్తుతం రూ. 66,999లకు అందుబాటులో ఉంది. అయితే 128జీబీ వేరియంట్ అసలు ధర రూ. 84,900 కి బదులుగా రూ. 71,999 లకు లభిస్తుంది. ఐఫోన్ 12 256జీబీ వేరియంట్ రూ. 81.999ధరలకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 94.900లు ఉండేది.
అలాగే ఆపిల్ ఐఫోన్ 12 ప్రో లో 256జీబీ వేరియంట్ రూ. 1,15,900లకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,25,900లుగా ఉంది. 512జీబీ వేరియంట్ రూ.1,45,900లకు లభించనుంది. ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లో మూడు వేరియంట్లు – 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్‌లతో – వరుసగా రూ. 1,25,900, రూ. 1,35,900, రూ. 1,55,900 లకు అందుబాటులో ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ తదుపరి తరం న్యూరల్ ఇంజిన్‌తో పాటుగా A14 బయోనిక్ చిప్‌తో విడుదల కానున్నాయి. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 వెనుకవైపు రెండు కెమెరాల మాడ్యూల్‌ను ఉంచారు. 12ఎంపీ అల్ట్రా వైడ్, వైడ్ కెమెరాలతో ఉన్నాయి. ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ అదనంగా 12ఎంపీ టెలిఫోటో కెమెరాతో అలరిస్తున్నాయి. ఈ ఫోన్లు అన్ని 5G టెక్నాలజీలో పనిచేసేందుకు రెడీగా ఉన్నాయి. అలాగే iOS 14తో పనిచేయనున్నాయి.
Also Read: రాత్రిపూట మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా.? అయితే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.!