Almond Tea: గుండె ఆరోగ్యం కోసం బాదం టీ..! ఈ 4 ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం..

Almond Tea Benefits: బాదంపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్,

Almond Tea: గుండె ఆరోగ్యం కోసం బాదం టీ..! ఈ 4 ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం..
Almond Tea
Follow us
uppula Raju

|

Updated on: Sep 14, 2021 | 6:59 PM

Almond Tea Benefits: బాదంపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. నానబెట్టిన బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. మెగ్నీషియం సరైన మొత్తంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు బాదంపప్పును అనేక విధాలుగా తీసుకోవచ్చు. మీరు బాదం టీ కూడా తయారు చేయవచ్చు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు చాలా ఆరోగ్యకరమైనది కూడా.

బాదం టీ తయారీ.. 1. 2 గంటల బాదం పప్పులను చల్లటి నీటిలో నానబెట్టాలి. 2. తరువాత వాటిని మళ్లీ వేడి నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి. 3. తర్వాత ఈ బాదంపప్పును గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. 4. ఈ పేస్ట్‌ని నీటిలో వేసి మరిగించాలి. 5. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు మరిగించాలి. 6. మీరు దీనిని వేడిగా లేదా చల్లగా కూడా తీసుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు..

1. యాంటీ ఏజింగ్- ఈ టీలో ఫైటోస్టెరాల్స్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు, అలాగే విటమిన్ ఇ ఉంటాయి. ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ముఖంపై ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది.

2. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది- ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడంలో తోడ్పడుతుంది.

3. దీర్ఘకాలిక వ్యాధి – ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల ధీర్ఘ కాలిక వ్యాధులను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. ఆర్థరైటిస్ – మీకు ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ సమస్యలు ఉంటే బాదం టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

5. ఆరోగ్యకరమైన గుండె కోసం – బాదం టీ రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

South Central Railway: పండుగల వేళ రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. స్పెషల్‌ ట్రైన్స్‌ను పొడగిస్తూ..

కొత్త ఫోటోషూట్ లో అందాలతో కుర్రకారుని కట్టిపడేస్తున్న బబ్లీ బ్యూటీ నిత్యా మీనన్..: Nithya Menen Photos.

Priyanka Gandhi: బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీ సలహాలు.. కాంగ్రెస్ కమిటీ తొలి భేటీలో అనూహ్య నిర్ణయాలు