Iron Rich Foods: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా..! కచ్చితంగా ఈ 5 ఆహారాలను డైట్‌లో చేర్చుకోండి..
Iron Rich Foods: దేశంలో మూడోవంతు పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
Iron Rich Foods: దేశంలో మూడోవంతు పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన సర్వేలో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 33 వేల మంది పిల్లలను చేర్చారు. సర్వేలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గ్రామీణ, పేద కుటుంబాల పిల్లలలో రక్తహీనత కేసులు ఎక్కువగా కనిపించాయి. దీనిని నివారించాలంటే రోజువారీ ఆహారంలో తగినంత ఐరన్ ఉండే విధంగా చూసుకోవాలి. లేదంటే రక్తహీనతో చాలామంది మరణించాల్సి వస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండే 5 ఆహార పదార్థాలను కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
1. హైడ్రేటెడ్‌గా ఉండండి: ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ముందుగా తాగునీరు శుభ్రంగా ఉండాలి. స్థానికంగా ఉండే బావినీటిలో ఐరన్ కలిసి ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల ఐరన్ లోపాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. 2. ఆకు కూరలు తినండి: పాలకూర, బచ్చలికూరలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారించాలంటే మీ డైట్‌లో కచ్చితంగా ఆకుకూరలను చేర్చాల్సిందే. 3. విటమిన్ సి చేర్చండి: అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం.. సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు విటమిన్ సి ఉండే ఆహారాలను తినాలి. 4. మాంసం, చికెన్: చికెన్, మటన్‌లలో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతను నివారించే ఫోలేట్ సమృద్ధిగా దొరుకుతుంది. 5. బీట్‌రూట్: శరీరంలో రక్తం మొత్తాన్ని పెంచడానికి బీట్‌రూట్ సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. 6. దానిమ్మ: దానిమ్మలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ శరీరంలో రక్తాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుంది. 7. డ్రై ఫ్రూట్స్: ఖర్జూరం, వాల్‌నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటి వల్ల ఎర్ర రక్త కణాలు రక్తంలో వేగంగా పెరుగుతాయి.