Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్..! రేపు ఈ సమయంలో బ్యాంకింగ్‌ సేవలు బంద్‌..

SBI Alert: తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలో బ్యాంక్‌లు సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉ

SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్..! రేపు ఈ సమయంలో బ్యాంకింగ్‌ సేవలు బంద్‌..
Sbi
Follow us
uppula Raju

|

Updated on: Sep 14, 2021 | 4:55 PM

SBI Alert: తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలో బ్యాంక్‌లు సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు గాను అప్పుడప్పుడు బ్యాంకింగ్ సంస్థలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఇలాంటి మెయింటెనెన్స్‌ యాక్టివిటీలు చేసే క్రమంలో సేవల్లో అంతరాయం ఏర్పడుతుంటుంది. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగాదారులకు ఇదే విషయాన్ని తెలియజేసింది. కాసేపటి క్రితమే ట్విట్టర్‌ వేదికగా ఎస్‌బీఐ ఈ ప్రకటన చేసింది.

సెప్టెంబర్ 15 న మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య (01.00 నుంచి 02.00 వరకు) ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు SBI ట్వీట్ చేసింది. ఈ కాలంలోSBI Online అందుబాటులో ఉండదని తెలిపింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. ఈ కారణంగా రేపు రెండు గంటలపాటు బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం కలగనుంది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌/యోనో/యోనో లైట్‌ సేవలు ఈ రెండు గంటల పాటు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని ట్వీట్ చేశారు. మరి ఈ సమయాల్లో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసేవారుంటే ముందుగానే జాగ్రత్త పడండి.

Assam Rifles Recruitment: అస్సాం రైఫిల్స్‌లో 1230 పోస్టులు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై శ్రీకాంత్ కు నరేష్ ఘాటు కౌంటర్..!(లైవ్ వీడియో): Naresh Vs Srikanth Video.

Minister Malla Reddy: తప్పకుండా వాడ్ని ఎన్‌కౌంటర్ చేసి పారేస్తాం.. మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన