Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Malla Reddy: తప్పకుండా వాడ్ని ఎన్‌కౌంటర్ చేసి పారేస్తాం.. మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు రాజుని ఎన్ కౌంటర్ చేస్తామని తెలంగాణ

Minister Malla Reddy: తప్పకుండా వాడ్ని ఎన్‌కౌంటర్ చేసి పారేస్తాం.. మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన
Minister Malla Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 14, 2021 | 4:59 PM

Hyderabad – Girl Murder: హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు రాజుని ఎన్ కౌంటర్ చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. కొంచెంసేపటి క్రితం మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిని హత్య చేసిన నిందితుడ్ని ఎన్‌కౌంటర్ చేసి పారేస్తామని ఆయన అన్నారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గ నూతన టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ మల్లారెడ్డి ఈ వాఖ్యలు చేశారు.

కాగా, సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని నిన్న కాంగ్రెస్‌, మజ్లిస్‌, బీఎస్పీ నేతలు పరామర్శించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మజ్లిస్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రి, బీఎస్పీనేత ప్రవీణ్‌కుమార్‌ బాలిక కుటుంబ సభ్యులను కలిశారు. సంఘటన జరిగి నాలుగైదు రోజులు గడుస్తున్నా మంత్రులు పరామర్శించకపోవడం దారుణమన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.

సింగరేణికాలనీలో విచ్చలవిడిగా డ్రగ్స్‌, మద్యం అమ్మకాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్‌ ట్రాక్‌కోర్టు ద్వారా కేసు విచారణ చేసి శిక్షపడేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మందు, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుతున్నాయని..దానివల్లే అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

అభం శుభం తెలియని చిన్నారి నరరూప రాక్షసుడి చేతిలో బలికావడం బాధ కలిగిస్తోందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామన్నారు. యాకుత్‌పురా MLA పాషాఖాద్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సంఘటన చాలా బాధాకరమని..నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సీపీకి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడం, ఎలాంటి సోషల్‌ మీడియాను ఫార్మాట్‌ను ఉపయోగించకపోవడంతో ఆచూకీ లభ్యం ఆలస్యమవుతున్నట్లు సమాచారం. సీసీ ఫుటేజీ, సొంతూరు, బంధువుల ఇళ్లలో గాలిస్తున్నారు.

Read also: Harish Rao: హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్ రావు

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!